Anchor Anasuya: చీరలోనూ తగ్గేదే లేదంటున్న రంగమ్మత్త.. యాంకర్ అనసూయ శారీ పిక్స్ వైరల్

Anchor Anasuya Saree Pics: స్టార్ యాంక‌ర్‌, న‌టి అన‌సూయ భ‌రద్వాజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోష‌ల్ మీడియాలో నిత్యం ఫొటోలు షేర్ చేస్తూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె చీర‌క‌ట్టుతో ఉన్న ఫొటోల‌ను పోస్ట్ చేసింది. చాలా క్యూట్‌గా ఉన్నాను క‌దూ.. అంటూ త‌న గ్లామ‌ర్‌పై త‌నే ప్ర‌శంసలు ఇచ్చుకుంది. మీరూ ఓ చూపు చూసేయండి.

  • Dec 11, 2022, 16:35 PM IST
1 /5

జబర్దస్త్‌ షోతో ఫేమస్ అయిన అనసూయ.. యాంకర్‌గా బుల్లితెరపై రాణిస్తునే.. నటిగా విభిన్నమైన పాత్రలతో తానేంటో ఎప్పటికప్పుడు నిరూపించుకుంది. అయితే తాజాగా ఒంగోలులోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో నటి మెహరీన్‌తో కలిసి సందడి చేసింది.  

2 /5

అనసూయను చూసేందుకు భారీగానే  ఆమె ఫ్యాన్స్ షాపింగ్ మాల్ వద్దకు చేరారు. తన కోసం వచ్చిన అభిమానులను చూసి ఆమె ఫిదా అయిపోయింది. కొంత మంది అభిమానులతో సెల్ఫీలు దిగి అనంతరం ఫొటో షూట్‌లో పాల్గొన్నారు.  

3 /5

ఈ పర్యటన తరువాత ఆమె ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి.. ఒంగోలు అభిమానులకు ఉద్దేశించి థ్యాంక్యూ అని ఓ వీడియో పోస్ట్ చేసింది.  

4 /5

యాంకర్లలో అనసూయ క్రేజ్ వేరు. ఎప్పటికప్పుడు తన ఎక్సపోజింగ్ తోనూ, వీడియోలతో ఫ్యాన్‌కు దగ్గరవుతూనే ఉంది.   

5 /5

ప్రస్తుతం చేతినిండా ఆఫర్లతో బిజీ బిజీగా ఉన్న ఈ బ్యూటీ.. మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే పుష్ప-2 షూటింగ్ లో పాల్గొనబోతుంది.