Punugulu Recipe: చల్ల చల్లని వానలో.. యమ్మీ యమ్మీ పునుగులు.. ఇలా ఈజీగా చేసుకొవచ్చు..

Punugulu recipe: చాలా మంది వర్షం పడగానే ఏదో ఒకటి వేడి వేడి పదార్థాలను తినాలనుకుంటారు. కొందరు కట్లేట్, గప్ చుప్ లు, మరికొందరు బజ్జీలు, పునుగులను తింటుంటారు. కానీ వర్షాకాలంలో బైటి ఫుడ్ తింటే పొట్టపాడౌతుంది.

1 /6

వర్షాకాలంలో రోజంతా చల్లగా ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం పూట ఏదో ఒక వేడి వేడి పదార్ధాలను తినాలని పిస్తుంటుంది. కానీ అందరు బైట ఫుడ్ మాత్రం తినరు. వీరికి ఇంట్లో చేసిన ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా ఇష్టంతో తింటుంటారు.

2 /6

ఇలాంటి నేపథ్యంలో.. పునుగులంటే ప్రతి  ఒక్కరు ఎంతో ఇష్టంతో తింటుంటారు. దీన్ని ఇప్పుడు ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొందరు చెనగపిండితో కూడా బజ్జీలు, పునుగులు చేస్తుంటారు.

3 /6

ముందుగా చెనగపిండిని మంచిగా గిన్నెలో నీళ్లు వేసుకుని నానబెట్టాలి. ఆ తర్వాత దీనిలో జీలకర్ర, ఉప్పు, కారం,పసుపు, ఓమా,కరివేపాకులను, మిర్చిముక్కలు, ధనియా పొడిలను సమపాళ్లలో వేయాలి.  

4 /6

వీటన్నింటిని చక్కగా కలుపుకుని కొన్ని నిముషాలు అలానే ఉంచేయాలి . అప్పటి దాక.. గ్యాస్ మీద కడయ్ పెట్టుకుని దానిలో నూనెను వేయాలి. ఆ నూనె వేడి అయ్యే వరకు కూడా అలానే ఉంచాలి. అప్పుడు దానిలో గిన్నెలు మిక్స్ చేసుకున్న.. బజ్జీల పిండి ముద్దలను మెల్లగా నూనెలో వేయాలి..

5 /6

ఇలా వేయగానే బజ్జీలు, పునుగులు ఒక్కసారిగా సల సలకాగుతాయి. ఇలా కాగిన తర్వాత.. జాలీ గంటతో కాస్త అటు ఇటు తిప్పాలి. ఆతర్వాత పునుగులను జాలీగంటతో మరోక గిన్నెలో తీయాలి.నూనె అంతా అడుగున వెళ్లే వరకు ఆగాలి.

6 /6

ఆ తర్వాత టమాటా సాస్, ఆనియన్స్, చింత పండు చట్నీలు మొదలైనవి వేసుకుని పునుగులను వర్షంలో ఎంతో ఎంజాయ్ చేస్తు తినేయోచ్చు. దీన్ని కేవలం అతి తక్కువ సమయంలో ఈజీగా ఇలా చేయోచ్చు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)