Tripti Dimri Viral Photos: ఒక్క సినిమాతోనే తెగ ఫేమస్ అయిపోయింది త్రిప్తి డిమ్రి. అప్పటివరకు హిందీ వారికి మాత్రమే తెలిసిన ఈ హీరోయిన్.. యానిమల్ సినిమా తర్వాత తెలుగు ప్రేక్షకులకు సైతం దగ్గర అయింది. తాజాగా ఈ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోలు కొన్ని ఇంస్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.
యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ సెలబ్రిటీ అయిపోయిన బోల్డ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. దాదాపు 8 సంవత్సరాలకు పైగా సక్సెస్ కోసం ఎదురుచూసిన ఈ ముద్దుగుమ్మకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మంచి విజయాన్ని అందించారు.
ఈ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయిన ఈమె ఆ తర్వాత పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా మారింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ బోల్డ్ ఫోటోషూట్స్ తో యువతను ఉక్కిరిబిక్కిరి చేసే ఈమె తాజాగా చీర కట్టులో సాంప్రదాయంగా కనిపించి అందరినీ ఆకట్టుకుంది.
ఎంబ్రాయిడరీ తో ప్రత్యేకంగా తయారు చేసిన ఆరెంజ్ కలర్ నెట్టెడ్ సారీ ధరించి, అందుకు భిన్నంగా ఎంబ్రాయిడరీ తో చాలా అద్భుతంగా డిజైన్ చేసిన మెరూన్ కలర్ బ్లౌజ్ ధరించి సాంప్రదాయానికి నిలువెత్తు రూపంగా అనిపించింది.
హెయిర్ లీవ్ చేసి గాలికి ఎగురుతున్న కురుల మధ్య తన అందాలతో మరొకసారి అలరించింది. కాటుక కళ్ళతో కవ్వించింది. ఎప్పుడు బోల్డ్ ఫోటోషూట్ చేసి అభిమానులకు బోర్ కొట్టించిన ఈమె తాజాగా చీరకట్టు లో కనిపించి మెస్మరైజ్ చేసింది.
త్రిప్తి డిమ్రి షేర్ చేసిన ఫోటోలకి అభిమానులే కాదు నెటిజెన్లు కూడా ఫిదా అవుతూ పలు రకాల ఎమోజీలు షేర్ చేస్తూ ఆమెపై ఉన్న ప్రేమను కామెంట్ల రూపంలో చూపిస్తున్నారు.
ప్రస్తుతం త్రిప్తి డిమ్రి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. అమ్మడు అందానికి ఫిదా అవుతున్నామంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా దసరా పండుగ సందర్భంగా సాంప్రదాయంగా కనిపించి అందరిని ఆకట్టుకుంది.