RTC Jobs: నిరుద్యోగులకు ఆర్టీసీ భారీ శుభవార్త.. 7,545 ఖాళీల భర్తీకి ప్రభుత్వం కసరత్తు..!

APSRTC Jobs: నిరుద్యోగులకు ఆర్టీసీ నుంచి భారీ శుభవార్త. ఏపీఎస్‌ఆర్టీసీ ఖాళీలు త్వరలో భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగాల భర్తీ చేపడుతున్న ప్రభుత్వం ఇప్పుడు ఆర్టీసీ ఖాళీలను భర్తీ చేయడానికి కూడా కసరత్తు ప్రారంభించింది.
 

1 /5

APSRTC Jobs: ఏపీ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ఒక్కో పథకం అమలు చేస్తూ వస్తోంది. మొన్నటికి మొన్న మెగా డీఎస్సీ విడుదల చేసింది.ఇప్పుడు ఆర్టీసీ ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టింది.  

2 /5

ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ ఉద్యోగల భర్తీకి భారీ కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన వివరాలను ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి సమర్పించింది.   

3 /5

ఏపీఎస్‌ఆర్టీసీలో 7,545 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. అంటే మొత్తంగా 18 కేటగరీల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఇదులో 3,673 రెగ్యులర్ డ్రైవర్లు, 1813 కండక్లర్‌, 579 అసిస్టెంట్‌ మెకానిక్‌, 207 ట్రాఫిక్‌ సూపర్‌ వైజర్ ట్రైనీలు, 179 మెకానికల్‌ , 280 డిప్యూట సూపరింటెండెంట్‌, 656 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు.  

4 /5

ఈ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఆర్టీసీ ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే అప్రెంటీస్‌ పోస్టులను కూడా ఏపీఎస్‌ఆర్టీసీ దరఖస్తులు స్వీకరిస్తోంది.  

5 /5

డిజిటల్‌ మెకానిక్‌, పెయింటర్‌, వెల్డర్‌ పోస్టులను భర్తీ చేస్తుంది. దీనికి ఐటీఐ పూర్తి చేసినవారు అర్హులు. జిల్లాల వారీగా తమ వివరాలను నమోదు చేసుకోవాలి. సర్టిఫికేట్లు పరిశీలించిన తర్వాత తుదిజాబితా సిద్ధం చేస్తారు.