Things Asthmatic Patients Should Avoid: ఆస్తమా రోగులు ఈ 5 విషయాలకు దూరంగా ఉండాలి

Foods Avoid By Asthmatic Patients: ఆస్తమా సమస్యతో బాధపడేవారు ఖచ్చితంగా ఈ పదార్థాలకు దూరంగా ఉండాలి. 

Foods Avoid By Asthmatic Patients: ఆస్తమా అనేది దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధి, ఇది ఊపిరితిత్తుల వాపు మరియు శ్వాస మార్గాల కుంచింపును కలిగిస్తుంది. దీని వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, ఛాతీ బిగుతు వంటి సమస్యలు కలుగుతాయి. అయితే ఈ సమస్య ఉన్నవారు కొన్ని రకాల పదార్థాలను తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

1 /6

2 /6

ఆస్తమా రోగులు వారికి అలెర్జీ కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. సాధారణ అలెర్జీ ట్రిగ్గర్‌లలో గింజలు, సీఫుడ్‌, గుడ్లు, స్ట్రాబెర్రీలు, టమోటాలు వంటి కొన్ని పండ్లు, కూరగాయలు ఉండవచ్చు. 

3 /6

ఆస్తమా రోగులకు పాలు, చీజ్‌ , క్రీమ్‌ వంటి పాల ఉత్పత్తులు, శ్వాసనాళాల్లో కఫాన్ని పెంచుతాయి. ఇది ఆస్తమా లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.

4 /6

వేయించిన, ఫాస్ట్ ఫుడ్స్‌లో ట్రాన్స్ ఫ్యాట్స్ సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి వాపు, ఆస్తమా లక్షణాలను పెంచుతాయి. 

5 /6

ప్యాక్‌ చేసిన స్నాక్స్‌, జంక్‌ ఫుడ్‌ , రెడీ-టు-ఈట్‌ మీల్స్‌ వంటి ప్రాసెస్‌ చేయబడిన ఆహారాలలో ప్రిజర్వేటివ్‌లు, సంకలనాలు ఉంటాయి, ఇవి ఆస్తమా వ్యక్తులు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది.  

6 /6

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఆస్తమా లక్షణాలు పెరుగుతాయి. అధికంగా ఉండే ఆహారాలు రక్తపోటును పెంచుతాయి, ఊపిరితిత్తుల చికాకును కలిగిస్తాయి.