August Bank Holidays: ఆగష్టు నెల బ్యాంకు సెలవుల్లో బిగ్ ట్విస్ట్.. రక్షాబంధన్ కు సెలవు లేనట్టేనా..!

August Holidays 2024: ఏ నెలలో లేనన్ని సెలవులు ఆగష్టు నెలలో ఉంటాయి. ఈ నెలలో రక్షా బంధన్, స్వాతంత్య్ర దినోత్సం, వరలక్ష్మి వ్రతం,  జన్మాష్టమి, రెండో శనివారం సహా ఎన్నో సెలవులున్నాయి. అయితే.. రక్షా బంధన్ కు కొన్ని బ్యాంకులు హాలీడే ప్రకటిస్తే.. మరికొన్ని బ్యాంకులకు సెలవు ఇవ్వడం లేదట.

1 /5

ఆగష్టు నెలలో  దేశ వ్యాప్తంగా వివిధ జోన్లలో మొత్తంగా 31 రోజుల్లో 13 రోజులు సెలవులున్నాయి. అందులో 4 ఆదివారాలు, 2 శనివారాలు,  పంద్రాగష్టు సెలవుతో పాటు మరో 6 సెలవులు ఉన్నాయి.

2 /5

ఆగష్టు నెలలో వివిధ రాష్ట్రాల్లో పండగల  ప్రాధాన్యత దృష్ట్యా బ్యాంకులకు వివిధ రోజుల్లో సెలవులు ప్రకటించారు. ఆగష్టు 15న దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు.  

3 /5

అటు ఆగష్టు 19న రాఖీ పండగ సందర్భంగా సెలవు ప్రకటించారు. కానీ దక్షిణాదిలో కొన్ని రాష్ట్రాల్లో ఈ రోజు సెలవు లేదు. అక్కడ వేరే ముఖ్యమైన రోజున బ్యాంకులకు హాలీడే ప్రకటించారు. .

4 /5

ముఖ్యంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రం ఆగష్టు 20 మంగళవారం బ్యాంకులకు సెలవులు ప్రకటించారు.

5 /5

ఆగష్టు 24 నాల్గో శనివారం, 25 ఆదివారం, 26 జన్మాష్టమి వరుసగా మూడు రోజులు సెలవులు. కాబట్టి ఆగష్టు నెలలో బ్యాంక్ సెలవులను బట్టి మీ కార్యక్రమాలను ప్లాన్  చేసుకోండి.