ముంబైలో పుట్టి పెరిగిన అవికా గోర్ చిన్ననాటి నుంచే సీరియల్స్ లో అలాగే సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. ముందుగా రాజకుమార్ ఆర్యన్ అనే సీరియల్ ద్వారా తన నటనా ప్రస్థానం ప్రారంభించిన ఆమె బాలిక వధు(తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు) అనే సీరియల్ ద్వారా సూపర్ క్రేజ్ దక్కించుకుంది.
ఇక అదే ఏడాది మార్నింగ్ వాక్ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ప్రస్థానం కూడా మొదలుపెట్టింది. ఇక అలా మొదలుపెట్టిన ఆమె ఈ మధ్యలో అనేక సీరియల్స్, సినిమాల్లో కూడా నటించింది.
తెలుగులో ఉయ్యాల జంపాల అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అవికా తర్వాత లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, తను నేను వంటి సినిమాల్లో కనిపించింది.
చివరిగా ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాతో హిట్టు అందుకున్న ఆమె తర్వాత సుదీర్ఘ గ్యాప్ తీసుకుని రాజు గారి గది 3లో మళ్ళీ కనిపించింది. తర్వాత నెట్, బ్రో, టెన్త్ క్లాస్ డైరీస్, థాంక్యూ వంటి సినిమాల్లో ఆమె అడపాదడపా చిన్న చిన్న పాత్రలు చేస్తోంది.
అయితే ఈ మధ్యకాలంలో ఎప్పుడూ కూడా ఎక్కువగా హాట్ షో చేయడానికి ఆసక్తి చూపించని ఆమె ఒక్కసారిగా హాట్ షోకి తెరలేపింది. ఏకంగా మాల్దీవులలో బికినీతో దిగిన ఫోటోలను షేర్ చేసి ఒక్కసారిగా కుర్ర కారు అందరినీ తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి.