Bank lockers Rules: బ్యాంకు లాకర్‌లో ఈ వస్తువులు పెట్టకూడదు.. రూల్స్‌ ముందుగానే తెలుసుకోండి...

Must Not Keep These Items in Bank Locker: బ్యాంకుల్లో మనం సాధారణంగా డబ్బులు దాచుకుంటాం. ఏవైనా బంగారం, ముఖ్యమైన పత్రాలను లాకర్‌లో దాచుకుంటాం. అక్కడ అయితే, అవి భద్రంగా ఉంటాయి. అయితే, బ్యాంకు లాకర్‌లో పెట్టకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం.
 

1 /7

బ్యాంకులో బంగారం ఇతర ముఖ్యమైన పత్రాలు దాచిపెడతారు. అయితే, బ్యాంకుల్లో కొన్ని వస్తువులు పెట్టకూడదని కూడా నిబంధన ఉందని మీకు తెలుసా?   

2 /7

బ్యాంక్‌ లాకర్‌లో మనం పెట్టకూడని వస్తువులు ఏంటో ముఖ్యంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఐసీఐసీఐ బ్యాంకుల ప్రకారం ఏ వస్తువులు పెట్టకూడదు?  

3 /7

సాధారణంగా బ్యాంకు లాకర్‌లో ఏవైనా వస్తువులు పెట్టాలంటే కనీస డిపాజిట్‌ నిబంధన కూడా ఉంది. బంగారం, ఇతర విలువైన వస్తువులు లాకర్‌లో పెడతాం. వీటితోపాటు వెండి, డైమండ్‌, బంగారం, వెండి కాయిన్స్‌తోపాటు బార్స్‌ కూడా పెట్టొచ్చు.  

4 /7

ఇవి కాకుండా కొన్ని భూమి లేదా ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు, పవర్‌ ఆఫ్‌ అట్టార్నీ, వీలునామాకు సంబంధించిన పత్రాలు, మ్యూచువల్‌ ఫండ్స్‌, షేర్లకు సంబంధించిన సర్టిఫికేట్లు పెడతాం.  

5 /7

అయితే, కొన్ని వస్తువులు బ్యాంకు లాకర్‌లో పెట్టకూడదు అనే నిబంధన కూడా ఉంది. కొన్ని ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డ్రగ్స్‌, ఇతర అక్రమంగా తీసుకువచ్చిన వస్తువుల కూడా లాకర్‌లో పెట్టకూడదు.  

6 /7

రేడియో యాక్టివ్‌, డేంజరస్‌ వస్తువులు, త్వరగా పాడయ్యే వస్తువులు, అంతేకాదు డబ్బు కూడా పెట్టడం కూడా ఏమాత్రం సేఫ్‌ కాదని వాటికి ఇన్సూరెన్స్‌ కూడా బ్యాంకులు ఇవ్వవు.  

7 /7

ఏవైనా బ్యాంకుల్లో మీరు ముఖ్యమైన వస్తువులు పెడితే వాటికి మీదే బాధ్యత ఉంటుందని గుర్తుంచుకోండి. ముఖ్యంగా బ్యాంకు గైడ్‌లైన్స్‌ కూడా పాటించండి.