Jani Master Arrest: జానీ మాస్టర్ కంటే జైల్లో చిప్పకూడు తిన్న సినీ సెలబ్రిటీలు ఎవరున్నారంటే..!

Jani Master Arrest: సినిమాల్లో హీరోలు నిజ జీవితంలో కూడా అలాగే ఉంటారని అనుకోవడం పొరపాటనే చెప్పాలి.
తెరపై నాయకులుగా చెలామణి అయ్యే హీరోలు.. నిజ జీవితంలో విలన్స్ గా అడ్డంగా బుక్కైన సందర్భాలున్నాయి. తాజాగా జానీ మాస్టర్ పై  లైంగిక వేధింపుల ఆరోపణలపై బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేసారు. ఈయన కంటే ముందు జైలు జీవతం గడిపిన సినీ సెలబ్రిటీలు ఎవరున్నాంటే..

1 /9

జానీ మాస్టర్.. ప్రస్తుతం జానీ మాస్టర్ ఉదంతం తెలుగు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. అయితే.. అవకాశాల కోసం తన దగ్గరకు వచ్చే మహిళ కొరియోగ్రాఫర్స్ ను లోబరుచుకోవడం ద్వారా  ఛాన్సులు ఇచ్చేవాడని అతనిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసారు.  ముఖ్యంగా మైనర్ పై అత్యాచారం నేపథ్యంలో పోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. ఇంకా జైలు జీవితం గడిపిన వాళ్లు చాలా మంది ఉన్నా.. ఈ నేపథ్యంలో జైలు కెళ్లిన కొంత మంది సెలబ్రిటీల విషయానికొస్తే..

2 /9

దర్శన్..   కన్నడ స్టార్ హీరో దర్శన్  తన ఫ్యాన్ రేణుకా స్వామి హత్య కేసులో అడ్డంగా దొరికిపోయి ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు. కొత్త చట్టాల ప్రకారం ఇతనికి 10 యేళ్ల నుంచి యావజ్జీవ శిక్ష పడే ఛాన్సెస్ ఉన్నాయి.

3 /9

సల్మాన్ ఖాన్.. 1998లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ సమయంలో కృష్ణ జింకలను వేటాడిన కేసులో జోధ్ పూర్ కోర్టు సల్లూను దోషిగా ఖరారు చేస్తూ  ఐదేళ్ల శిక్ష విధించింది. కొన్నేళ్లు ఈ కేసులో సల్మాన్ జైలు జీవితం గడిపారు. డబ్బు, పలుకుపడి, సెలబ్రిటీ హోదా కారణంగా  ప్రస్తుతం బెయిల్ పై బయట తిరుగుతున్నాడు.

4 /9

సంజయ్ దత్.. బాలీవుడ్ బ్యాడ్ బాయ్ .. ఖల్ నాయక్  పేరుకు తగ్గట్టు 1993 అక్రమాయుధాలు కలిగి ఉన్నాడన్న కారణంతో  కోర్టు ఇతన్ని ఐదేళ్ల శిక్ష విధించింది. జైలు శిక్ష అనుభవించిన తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

5 /9

సైఫ్ అలీ ఖాన్.. ఒక పర్సన్ ను అకారణంగా కొట్టినందున సైఫ్ అలీ ఖాన్ జైలు కెళ్లాల్సి వచ్చింది.

6 /9

రాజ్ కుంద్రా.. శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా.. పోర్న్ కేసులో అరెస్టై జైలు జీవితం గడుపుతున్నాడు. ఈ పోర్న్ రాకెట్ హిందీ చిత్ర సీమలో  సంచలనంగా మారింది.

7 /9

మోనికా బేడి.. అక్రమ పాస్ పోర్ట్ కలిగి ఉన్నందకు తన లవర్ అబూ సలేంతో కలిసి మోనికా బేడి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. 

8 /9

జాన్ అబ్రహం.. రాష్ డ్రైవింగ్ కారణంగా జాన్ అబ్రహం అప్పట్లో 15 రోజుల పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది.

9 /9

సుమన్.. టాలీవుడ్ సీనియర్ హీరో సుమన్..పోర్నోగ్రఫీ కేసులో అరెస్టై జైలు జీవితం గడిపారు. ఆ కేసులో ఆయన్ని అక్రమంగా ఇరికించారని తేలడంతో నిర్ధోషిగా విడుదలయ్యారు.