Best Mehndi Designs: గోరింటాకు..అందమైన మగువల చేతిని మరింత అందం తెచ్చిపెడుతుంటుంది పెళ్లిళ్ల సీజన్ వస్తే చాలు మెహెందీ సందడి ఇంకా పెరుగుతుంది. చేతి నిండా విభిన్న అందమైన ఆకృతులతో డిజైన్లు వేయించుకుంటుంటారు. మెహెందీ లేకుండా మహిళల అలంకరణ పూర్తి కాదంటే అతిశయోక్తి కానే కాదు. అయితే మెహెందీ డిజైన్ విషయంలో చాలామంది సరైన నిర్ణయం తీసుకోలేకపోతుంటారు. అందుకే మీ కోసం 5 అందమైన మెహందీ డిజైన్లు
అరబిక్ మెహెందీ అరబిక్ మెహెందీ డిజైన్‌లో సెంట్రలైజ్డ్ డిజైన్ ఉంటుంది. ఇందులో అరచేతిని ఖాళీగా వదిలేస్తారు. చేతులపై వెదజల్లినట్టుండే ప్యాటర్న్ ఉంటుంది. బ్లాక్ కెమికల్‌తో అవుట్ లైన్ వేసి మధ్యలో మెహెందీ షేడింగ్ ఇస్తారు. ఈ డిజైన్ ఎలాంటి చేతికైనా అద్భుతంగా కన్పిస్తుంది. ఈ డిజైన్ వేయడం కూడా చాలా సులభం. ఇందులో ఉండే షేడింగ్స్ అద్భుతమైన నిండుదనపు లుక్ ఇస్తాయి.
బెంగాల్ మెహందీ బెంగాల్ మెహెందీ డిజైన్ లేదా చూడీ దార్ డిజైన్. ఎక్కువగా ఈ డిజైన్ గుండ్రని, లావుగా ఉన్న చేతులకు బాగుంటుంది. ఎందుకంటే ఈ డిజైన్ ఆకర్షణీయంగా కొట్టొచ్చినట్టుగా కన్పిస్తుంది. ఇందులో పూలు, నెమలి వంటి ఆకృతులు చేతికి అందాన్ని తీసుకొస్తాయి. ఇది చేతికి అన్ని వైపులా నిండుగా ఉంటుంది
మెహెందీ పూర్తిగా వేయించుకోవడం ఇష్టం లేనివారికి మినిమల్ మెహెందీ అవసరమౌతుంది. చేతిపై కొన్ని భాగాల్లో మెహెందీ డిజైన్ చిన్న చిన్న ఆకృతుల్లో వేసుకుంటే ఆకర్షణీయంగా కన్పిస్తుంది.
జ్యువెల్లరీ మెహెందీ జ్యువెల్లరీ మెహెందీ కూడా ప్రస్తుతం ట్రెండింగులో నడుస్తోంది. ఈ డిజైన్‌ను మహిళలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇందులో నగల ఆకృతులుంటాయి. రెండు చేతులకు పక్కభాగంలో వేసుకోవచ్చు. పొడుగ్గా ఉండే చేతులకు చాలా బాగుంటుంది. ఈ తరహా మెహెందీతో చేతులు చాలా నిండుగా ఉంటాయి. మొత్త చేతుల్ని కవర్ చేస్తూ మెహెందీ వస్తే చాలా అందంగా ఉంటుంది.
పోట్రేయల్ మెహెందీ పోట్రేయల్ మెహందీ అనేది ప్రస్తుతం చాలా ట్రెండింగులో ఉంది. ఇందులో తమకిష్టమైన వ్యక్తి ఫోటోను చిత్రీకరించవచ్చు. ఎక్కువగా పెళ్లిళ్లలో ఈ డిజైన్ వేయించుకుంటారు. ఇందులో వధువు, వరుడు, ఊరేగింపు, ఏనుగు వంటి వివిధ రకాల డిజైన్లు ఉంటాయి. ఇవి చేతికి ఆకర్షణను తీసుకొస్తాయి. కాబోయే భర్త ఫోటోను చిత్రీకరించుకుంటారు.