Weight Loss Diet: ఆధునిక బిజీ ప్రపంచంలో అధిక బరువు లేదా స్థూలకాయం అనేది అతి పెద్ద సమస్యగా మారింది. ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా బెల్లీ ఫ్యాట్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. శారీరక శ్రమ లేకపోవడంతో ఈ సమస్య మరింత పెరుగుతోంది. అయితే డైట్లో కొన్ని పదార్ధాలు చేర్చితే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ డైట్ ఎంటనేది తెలుసుకుందాం.
టోఫు ఇందులో ప్రోటీన్లు పుష్కలంగాఉంటాయి. కండరాలను పటిష్టం చేయడమే కాకుండా బెల్లీ ఫ్యాట్ వేగంగా కరిగిస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల వెయిట్ లాస్ ప్రక్రియలో ఉపయోగమౌతుంది.
ఓట్స్ ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఫ్యాట్ అస్సలుండదు. శరీరంలో అదనంగా ఉండే కొవ్వును నెమ్మదిగా కరిగిస్తుంది. పప్పులు తినడం వల్ల చాలాసేపటి వరకూ ఆకలి వేయకుండా ఉంటుంది. స్థూలకాయం తగ్గిస్తుంది
ఆకు కూరలు ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అద్భుతమైన లాభాలుంటాయి. శరీరం బరువు తగ్గించే క్రమంలో ఆకు కూరలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో ఫైబర్, ఇతర పోషకాలు చాలా ఎక్కువ. అందుకే డైట్లో పాలకూర, బీన్స్, మటర్ , బ్రోకలీ, తోటకూర తప్పకుండా ఉండేట్టు చూసుకోవాలి
బెర్రీస్ వీటిలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ. మరోవైపు కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే వెయిట్ లాస్ ప్రక్రియలో ఈ ఫ్రూట్ డైట్లో చేర్చాలి. ఇందులో పెద్దఎత్తున ఉండే విటమిన్ సి కడుపు చుట్టూ ఉండే ఫ్యాట్ లేదా బెల్లీ ఫ్యాట్‌ను కరిగిస్తుంది.
బాదం బాదం డ్రై ఫ్రూట్స్‌లో అతి ముఖ్యమైంది. ఇదొక సూపర్ ఫుడ్ లాంటిది. ఎందుకంటే ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, హెల్తీ ఫ్యాట్ పుష్కలంగా ఉంటాయి. ఒకసారి తింటే చాలా సేపటి వరకు ఆకలి నియంత్రణలో ఉంటుంది. దాంతో బరువు తగ్గించే ప్రక్రియలో బాదం అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో కేలరీలు కూడా తక్కువే.