Home Made Oil for Hair Fall: వర్షాకాలం ఆరోగ్యపరంగా అన్నీ ఇబ్బందులే. ఆరోగ్యపరమైన సమస్యలే కాకుండా జుట్టు సమస్యలు కూడా ఉత్పన్నమౌతుంటాయి. జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడి, పొడుగైన పటిష్టమైన జుట్టు కావాలనుకుంటే కొన్ని హోమ్ రెమిడీస్ పాటిస్తే చాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.
మెంతులు ఉల్లి పాయల ఆయిల్ తయారీ ఎలా ఈ అద్భుతమైన ఆయిల్ తయారీకు రెండు చెంచాల మెంతులు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి.
మెంతులు ఉల్లిపాయ ఆయిల్ జుట్టు పొడుగ్గా, పటిష్టంగా ఉండాలంటే మెంతులు, ఉల్లిపాయలు ఉపయోగించాలి. ఈ రెండింటితో కలిపి ఆయిల్ తయారు చేసి వాడితే జుట్టు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి
ఇందులో కొబ్బరి నూనె కలపాలి ఉల్లిపాయలు, మెంతుల మిశ్రమంలో ప్యూర్ కోకోనట్ ఆయిల్ కలపి 10-15 గంటలు ఉడికించాలి. చల్లారిన తరువాత జుట్టుకు అప్లై చేయాలి.
రెండూ కలిపి పేస్ట్ చేయాలి ఉల్లిపాయలు, మెంతులు రెండూ కలిపి మిశ్రమంగా మెత్తగా చేసుకోవాలి.
మెంతులు నానబెట్టాలి మెంతుల్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. ఆయిల్ తయారీకు మెంతుల్ని కనీసం 8 గంటలు నానబెట్టాలి. అప్పుడే మెంతులు మెత్తగా మారుతాయి.