Best Honeymoon Destinations | పెళిల్ల సీజన్ ప్రారంభం అయింది. ఇలాంటి సమయంలో పెళ్లి తరువాత హనీమూన్‌కు వెళ్లే వారి సంఖ్య కూడా బాగానే ఉంటుంది. హనీమూన్ సమయంలో కపుల్స్ ఒకరిని ఒకరు బాగా అర్థం చేసకోగలుగుతారు. దానికోసం మంచి హనీమూన్ లొకేషన్స్ వెతుకుతూ ఉంటారు. ఈ రోజు మీకు మేము అలాంటి కొన్ని హనీమూన్ స్పాట్స్ గురించి పరిచయం చేయబోతున్నాం.
అలెప్పీ అనేది టాప్ హనీమూన్ స్పాట్ మాత్రమే కాదు.. ఇది సౌత్‌లో అత్యంత అందమైన ప్రదేశం అని కూడా చెప్పవచ్చు. సంవత్సరం పొడవునా ఇక్కడికి లక్షలాది మంది టూరిస్ట్‌లు వస్తుంటారు.
ఊటి అనేది తమిళనాడులో ఉంది. మన తెలుగు సినిమాల్లో ( Tollywood) ఎక్కువ పాటలు ఇక్కడే షూట్ చేస్తుంటారు. సౌత్‌లో టాప్ హిల్ స్టేషన్స్‌లో ఇది కూడా ఒకటి. ఊటికి దగ్గరలో ఉన్న ఎయిర్ పోర్ట్ కోయంబత్తూర్. ఇది సౌత్ ఇండియాలోనే కాదు.. దేశం మొత్తంలోనే అత్యుత్తమ హనిమూన్ స్పాట్స్‌లో ఒకటి
హనీమూన్ వెళ్లాలి అనుకుంటున్న వారికి ఇది గోల్డెన్ స్పాట్ అని చెప్పవచ్చు. ఈ కొండల్లో... ఆ శీతల పవనాల్లో.. ప్రపంచాన్నే మైమరిచిపోవచ్చు. సౌత్ ఇండియాలో అత్యుత్తమ హనీమూన్ స్పాట్స్‌లో ఒకటి. కపుల్స్ చాలా మంది కనిపిస్తారు. పచ్చని మైదానాలు, ఎత్తుపల్లాలున్న కొండలు. కనుచూపుమేరా అంతా అందమే ..
ప్రపంచంలో ఎక్కువ మంది విజిట్ చేసే బీచుల్లో కోవలమ్ బీచ్ తప్పకుండా ఉంటుంది. బంగారు వర్ణంలో మెరుస్తూ ఉండే ఇసుకతిన్నెలపై నడుస్తూ వెళ్తే ఆ అనుభూతిని వర్ణించడం కష్టం. అప్పుడప్పుడు కాలికి తగిలి వెళ్లే అలలతో ఆ మజా మరింతగా రెట్టింపు అవుతుంది. ఇక్కడ హోటల్ రూమ్స్ నుంచి సముద్రాన్ని చూడటం అనేది అద్భుతమే.
పుదుచ్చెరి మంచి చరిత్రగల పర్యాటక స్థలం. ప్రతీ సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు పుదుచ్చెరికి వస్తుంటారు. ఇక్కడ మీరు భారతీయతతో (India) పాటు ఫ్రెంచ్ కల్చర్‌ను కూడా చూడవచ్చు. ఇక్కడ చరిత్రకు పట్టంగట్టే ఎన్నో స్మారకాలు ఉంటాయి. దాంతో పాటు ఆధ్యాత్మిక శోభకు ప్రతీరూపంగా నిలిచే ఎన్నో ఆలయాలు ఉంటాయి.