Top Romantic Places: వేసవి సెలవుల్లో ఆహ్లాదంగా గడిపే టాప్ 5 ప్రదేశాలు

ప్రస్తుతం వేసవి కాలం నడుస్తోంది. మరి కొద్దిరోజుల్లో వేసవి సెలవులుంటాయి. ఈ క్రమంలో సమ్మర్ వెకేషన్ లేదా మీ గర్ల్ ఫ్రెండ్‌తో లేదా భార్యతో ఏకాంతంగా గడిపేందుకు కొన్ని అద్భుతమైన ప్రదేశాలున్నాయి. అద్భుతంగా ఎంజాయ్ చేసేందుకు మంచి అనుభూతినిస్తాయి.

Top Romantic Places: ప్రస్తుతం వేసవి కాలం నడుస్తోంది. మరి కొద్దిరోజుల్లో వేసవి సెలవులుంటాయి. ఈ క్రమంలో సమ్మర్ వెకేషన్ లేదా మీ గర్ల్ ఫ్రెండ్‌తో లేదా భార్యతో ఏకాంతంగా గడిపేందుకు కొన్ని అద్భుతమైన ప్రదేశాలున్నాయి. అద్భుతంగా ఎంజాయ్ చేసేందుకు మంచి అనుభూతినిస్తాయి.

1 /5

లడాఖ్ లడాఖ్ ఓ అందమైన, ప్రత్యేకమైన ప్రాంతం. ఎత్తైన పర్వతాలు, మంచు కురిసే ఎడారి ప్రాంతాలు, ప్రశాంత వాతావరణంతో పర్యాటకుల్ని మంత్రముగ్దుల్ని చేస్తుంది. 

2 /5

డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ అత్యంత అందమైన ప్రాంతం. అందమైన టీ తోటులు, పచ్చపచ్చని కొండ ప్రాంతాలు, టాయ్ ట్రైన్ వంటివి మీ ప్రయాణాన్ని అందమైన అనుభూతిగా మలుస్తాయి.

3 /5

మసూరీ, ఉత్తరాఖండ్ మసూరీని కొండలకు రాణిగా పిలుస్తారు. అంత అందమైన ప్రదేశాలుంటాయి.  పచ్చపచ్చని కొండలు, అందమైన సరస్సులకు మసూరీ చాలా ప్రసిద్ధి. ఏకాంతంగా గడిపేందుకు, ఎంజాయ్ చేసేందుకు చాలా అనువైన ప్రాంతమిది.

4 /5

నైనితాల్, ఉత్తరాఖండ్ నైనీ సరస్సు, కొండ ప్రాంతాలు, ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి నైనితాల్. అందమైన ప్రాంతాలకు ఇక్కడ కొదవ లేదు. మీక్కావల్సినవారితో గడిపేందుకు ఇంతకంటే మంచి ఏకాంతమైన ప్రదేశం ఉండకపోవచ్చు.

5 /5

మనాలీ, హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్‌లోని అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రం మనాలీ. మంచు కురిసే కొండలు, సాహసోపేతమైన థ్రిల్లింగ్ అడ్వంచర్లు, ప్రశాంత వాతావరణం అన్నింటికీ మనానీ కేరాఫ్ అడ్రస్.