Income Tax Notice Issuing Transactions: బ్యాంక్ లావాదేవీలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంటు నుంచి నోటీసు వస్తుంది. దీనికి మనం కచ్చితంగా జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ లావాదేవీలు జరిపినా ప్రతి విషయంలో మనం ఆధార్ కార్డు, ప్యాన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మనం చేసిన ప్రతి లావాదేవీ ఆదాయ పన్ను శాఖ వారికి త్వరగా తెలిసిపోతుంది. అయితే, ఓ 5 రకాల బ్యాంక్ లావాదేవీలు చేస్తే నోటీసులు జారీ చేస్తారు. అవి ఏంటో తెలుసుకుందాం.
సేవింగ్ ఖాతా.. సేవింగ్ ఖాతాలో సాధారణంగా లక్ష రూపాయల వరకు డిపాజిట్ లిమిట్ ఉంటుంది. ఒకవేళ మీరు ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షలు అంతకంటే ఎక్కువ డబ్బును సింగిల్ లేదా మల్టిపుల్ డిపాజిట్స్ చేసినప్పుడు ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీసు వస్తుంది. అదేవిధంగా కరెంట్ అకౌంట్ ఉంటే రూ. 50 లక్షల పరిమితి మాత్రమే ఉంది.దీనికి మించకూడదు.
క్రెడిట్ కార్డు బిల్లు.. లక్ష రూపాయల కంటే ఎక్కువ సింగిల్ పేమెంట్ బిల్లు చెల్లించకూడదు. ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో రూ.10 లక్షలు మించకూడదు. లేదంటే ఒక వ్యాలిడ్ రీజన్ చెప్పాల్సి ఉంటుంది. ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి.
ఫిక్సెడ్ డిపాజిట్.. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 10 లక్షల కంటే ఎక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే సరైన వివరణ ఇవ్వాలి. లేదంటే ఆదాయపన్ను శాఖ నుంచి మీకు నోటీసు వస్తుంది.
స్టాక్ మార్కెట్స్.. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే కూడా రూ.10 లక్షలు మించకూడదు. ఈ విషయంలో కూడా ఆదాయపన్ను శాఖ వారు నోటీసులు జారీ చేస్తారు. మీరు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనికి జవాబు కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది.
ఆస్తులు.. ఆదాయ పన్ను శాఖ వారు నోటీసులు జారీచేసే మరో లావాదేవీ ఆస్తి పన్నులు కొనుగోలు, విక్రయాలు జరపడం. రూ.30 లక్షల కంటే ఎక్కువ క్రయవిక్రయాలు జరిపితే కచ్చితంగా ఆదాయపన్ను వారికి జవాబు చెప్పాల్సి ఉంటుంది.