Bhagyashree pics: మైనే ప్యార్ కియా..లేదా ప్రేమ పావురాలు సినిమా గుర్తుంది కదా. సల్మాన్ ఖాన్ ( Salman khan ) తొలి సినిమా. బాలీవుడ్ బంపర్ హిట్ మూవీ. అన్ని భాషల్లోనూ హిట్ అయిన సినిమా. 1989లో విడుదలై అప్పట్లో ఓ సంచలనం. సంగీతపరంగా ఎవర్ గ్రీన్ హిట్. బాలీవుడ్లో ఈ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ భాగ్యశ్రీ ( Bhagyashree ).. ప్రేమ పావురాలు తరువాత వెంటనే వ్యాపారవేత్త హిమాలయ దసానీని పెళ్లి చేసుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే భాగ్యశ్రీ..ఇటీవల ఫిట్నెస్ వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తోంది. 51 ఏళ్ల వయస్సులో కూడా అందంగా..25 ఏళ్ల పడుచులా యవ్వనంగా కన్పిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆమె బ్యూటీ సీక్రెట్ అందరితో పంచుకుంటోంది. యోగా నుంచి ఎక్సర్సైజ్ వరకూ అన్ని వీడియోల్ని షేర్ చేస్తోంది. అందుకే నిత్య యవ్వనంగా 25 ఏళ్ల యువతిలా కన్పిస్తోంది.