Bone Health: ఎముకలు ఆరోగ్యంగా పటిష్టంగా ఉండాలంటే ఈ 5 ఫుడ్స్ దూరం పెట్టాలి

మనిషి శరీర నిర్మాణం, ఎదుగుదలలో ఎముకలు కీలకపాత్ర పోషిస్తాయి. ఎముకలు పటిష్టంగా ఉన్నంతవరకే శరీరం స్ట్రాంగ్ ఉంటుంది. అయితే మనం తీసకునే చెడు ఆహారపు అలవాట్ల కారణంగా బోన్ కేన్సర్, బోన్ డెన్సిటీ తగ్గడం, బోన్ ఇన్‌ఫెక్షన్ , ఆస్టియోపోరోసిస్, రికెట్స్ వంటి వ్యాధులు తలెత్తుతాయి.  ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పదార్ధాలను డైట్ నుంచి దూరం చేయాలి.

Bone Health: మనిషి శరీర నిర్మాణం, ఎదుగుదలలో ఎముకలు కీలకపాత్ర పోషిస్తాయి. ఎముకలు పటిష్టంగా ఉన్నంతవరకే శరీరం స్ట్రాంగ్ ఉంటుంది. అయితే మనం తీసకునే చెడు ఆహారపు అలవాట్ల కారణంగా బోన్ కేన్సర్, బోన్ డెన్సిటీ తగ్గడం, బోన్ ఇన్‌ఫెక్షన్ , ఆస్టియోపోరోసిస్, రికెట్స్ వంటి వ్యాధులు తలెత్తుతాయి.  ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పదార్ధాలను డైట్ నుంచి దూరం చేయాలి.

1 /5

టీ కాఫీ దేశంలో టీ-కాఫీ తాగేవారికి కొదవ లేదు. చాలామంది టీ కాఫీతోనే దినచర్య ప్రారంభిస్తుంటారు. కానీ ఈ అలవాటు ఏమాత్రం మంచిది కాదు. ఇందులో ఉండే కెఫీన్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. 

2 /5

సోడా డ్రింక్ చాలా మంది సాఫ్ట్ డ్రింక్స్ , సోడా తాగడాన్ని ఇష్టపడుతుంటారు. ఇది మంచి అలవాటు కాదు. ఎముకలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే సాఫ్ట్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి

3 /5

సాల్ట్ పదార్ధాలు సోడియం ఎముకలకు తీవ్ర నష్టం చేకూరుస్తుందది. దాంతో ఆస్టియోపోరోసిస్ వ్యాధి ముప్పు పెరుగుతుంది. సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల బలహీనంగా మారుతాయి. 

4 /5

మద్యం మద్యం అనేది కేవలం ఎముకల అనారోగ్యానికే కాదు చాలా వ్యాధులకు కారణమమౌతుంంది. ఎముకలకు హాని కల్గిస్తుంది. ఎముకల ఎదుగుదల నిలిచిపోతుంది. బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది. ఫ్రాక్చర్ రిస్క్ పెరుగుతుంది.

5 /5

స్వీట్ ఫుడ్ స్వీట్స్ తినడం చాలా మందికి ఇష్టం. స్వీట్స్ ఎక్కువగా తినడం వల్ల కేవలం డయాబెటిస్ రోగులకే మంచిది కాదనుకుంటాం. కానీ ఎముకలపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉంచేందుకు స్వీట్స్‌కు దూరంగా ఉండాలి