BSNL: స్పీడ్‌ పెంచిన బీఎస్‌ఎన్‌ఎల్.. రూ. 350 లోపు బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్స్‌తో జియో, ఎయిర్‌టెల్‌కు బిగ్‌ ఛాలెంజ్‌..

BSNL Broadband Plan: ఇటీవలె పెరిగిన టెలికాం ఛార్జీల టారీఫ్‌ల నేపథ్యంలో జియో, ఎయిర్‌ టెల్‌, వీఐ మొబైల్‌ ట్యారిఫ్‌లను 15 శాతం వరకు పెంచేశాయి. దీనివల్ల చాలామంది మొబైల్‌ యూజర్లు బీఎస్‌ఎనల్‌ఎల్‌కు పోర్ట్ అవుతున్నారు.
 

1 /5

బీఎస్‌ఎనల్‌ఎల్‌ అతి తక్కువ ధరకే ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకువస్తుంది. ప్రత్యేకంగా 4 జీ సర్వీసులను కూడా స్పీడ్‌ గా పెంచుతూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ రాష్ట్రప్రభుత్వ కంపెనీ ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లతో కూడా జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి పోటీని అందిస్తోంది.   

2 /5

బీఎస్‌ఎనల్‌ఎల్‌ ఇటీవలె బ్రాడ్‌ బ్యాండ్‌ స్పీడ్‌ లెవల్‌ కూడా అప్‌గ్రేడ్‌ చేశాయి. దీంతో వీటి ప్లాన్‌లు కూడా వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. కేవలం రూ. 500 లోపు అందుబాటులో ఉండే ఈ బ్రాడ్‌ బ్యాండ్ ప్లాన్ల స్పీడ్‌ లిమిట్‌ పెంచేశాయి. ముఖ్యంగా రూ.249,  రూ.299, రూ. 329 ప్లాన్లపై స్పీడ్‌ లిమిట్‌ పెంచారు. ఆ వివరాలు తెలుసుకుందాం.  

3 /5

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.249 నెలవారీ రీఛార్జీ ప్లాన్‌ లిమిట్‌ ఇంతకు ముందు 10 mbps స్పీడ్‌ ఉండేది. తాజాగా వీటి స్పీడ్‌ లిమిట్‌ 25 mbps కు పెంచింది. ఇక మరో రెండు ప్లాన్లు రూ.299, రూ. 329 ప్లాన్స్‌పై కూడ 10 mbps స్పీడ్‌ నుంచి 25 mbps అప్‌గ్రేడ్‌ చేశాయి.    

4 /5

ఈ ప్లాన్స్‌ ముఖ్యంగా ఫెయిర్‌ యూసేజ్‌ పాలసీ (FUP) కిందకు వస్తాయి. అంటే రూ.249 ప్లాన్‌లో 10 GB FUP, రూ. 299 ప్లాన్‌లో 20 GB FUP అందిస్తాయి. FUP లిమిట్‌ ముగిసిన తర్వాత నెట్ స్పీడ్‌ లిమిట్‌ 2 mbps కు తగ్గిపోతుంది. ఇది మూడు ప్లాన్లకు వర్తిస్తుంది.  అదేవిధంగా రూ.329 ప్లాన్‌ 1000 GB FUP లిమిట్‌ దాటిన తర్వాత 4 mbps కు తగ్గిపోతుంది.  

5 /5

అయితే, రూ.249, రూ. 299 ప్లాన్లు కేవలం కొత్త వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రూ.329 ప్లాన్లు ఎంపిక చేసిన సర్కిళ్లలోనే అందుబాటులో ఉన్నాయి. అయితే, బీఎస్‌ఎన్‌ఎల్‌ కు మారే ముందు మీ ఏరియాల్లో నెట్వరక్‌ యాక్సెస్‌కు వీలుందా లేదా తెలుసుకోవాలి.