Buddha Purnima 2024: బుద్ధ పౌర్ణమి రోజు తప్పకుండా చేయాల్సిన పనులు ఇవే!


Buddha Purnima 2024: ఈ సంవత్సరం వైశాక పౌర్ణమి 23వ తేదీన వచ్చింది ఈరోజు ను బుద్ధ పౌర్ణిమగా కూడా పిలుస్తారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ పౌర్ణమి రోజున కొన్ని పనులు చేయడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.

 

Buddha Purnima 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వైశాఖ పౌర్ణిమకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు దానాలు చేయడం గురువులను పూజించడం, దానాలు స్వీకరించడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని ఒక నమ్మకం. అంతేకాకుండా ఈ వైశాఖ పౌర్ణమిని బుద్ధ పౌర్ణిమ గా కూడా పిలుస్తారు. అయితే ఇలా పిలవడానికి గల కారణాలేంటో వైశాక పౌర్ణిమ రోజు తప్పకుండా చేయాల్సిన పనులేంటో మనం ఈరోజు తెలుసుకుందాం. 
 

1 /6

వైశాఖ పౌర్ణిమ ఈ సంవత్సరం మే 22వ తేదీన 5. 42 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాతి రోజు ఈ పౌర్ణిమ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈరోజు ప్రత్యేక పౌర్ణమి రోజు ప్రత్యేకమైన పూజలు చేసేవారు మే 23వ తేదీన చేయడం చాలా మంచిది. 

2 /6

అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బుద్ధ పౌర్ణమి రోజున బుద్ధుడికి సంబంధించిన విగ్రహాలను ఆయన చిత్రపటాలను ఇంటికి తీసుకువచ్చి, ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. అలాగే ఈరోజు బుద్ధుడికి ఉపవాసం పాటించడం వల్ల కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయట. 

3 /6

 షుయ్ ప్రకారం వైశాఖ పౌర్ణమి రోజున బుద్ధుడి చిత్రపటాలను ఇంటికి తీసుకురావడం, బహుమతిగా ఇవ్వడం వల్ల ఇంట్లో ఆనందం రెట్టింపు అవుతుంది. అలాగే అదృష్టం కూడా పెరుగుతుందని ఒక నమ్మకం. 

4 /6

అంతేకాకుండా ఈ వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి సంబంధించిన యంత్రాన్ని కొనుగోలు చేసి, ఇంట్లో ప్రత్యేకమైన పూజలు చేయడం వల్ల ధన లాభాలు కూడా కలుగుతాయని పురాణాల్లో పేర్కొన్నారు. 

5 /6

అలాగే ఈరోజు ఇత్తడితో తయారుచేసిన లక్ష్మీదేవిని పూజిస్తే ఇంట్లో ఉండే దరిద్ర్యం తొలగిపోతుందట. అలాగే కుటుంబంలో శాంతి, సంతోషం పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

6 /6

వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించే క్రమంలో అమ్మవారి ముందు వెండి లేదా బంగారం నాణాలను ఉంచి ప్రత్యేకమైన పూజ కార్యక్రమం చేయడం ఎంతో శుభప్రదం. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పురాణాల్లో తెలిపారు.