Employees Get 4 Days Holidays: న్యూ ఇయర్ వేళ ఉద్యోగులకు బంపర్ గుడ్ న్యూస్. వరుసగా నాలుగు రోజులు సెలవులు రాబోతున్నాయి. అది కూడా ఈ నెలలోనే.. ముఖ్యంగా ఇది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు బంపర్ గుడ్ న్యూస్ దీంతో వారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.. ఇక కొత్త టూర్స్, ట్రిప్స్ వేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు.
తెలంగాణలో జనవరి 1న ఈరోజు కూడా అన్ని విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవులు ఇచ్చాయి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో వర్కింగ్ డే. అయితే, వరుసగా నాలుగు రోజులు సెలవులు రాబోతున్నాయి.
ఇటీవలె సంక్రాంతి సెలవుల కుదింపుపై క్లారిటీ ఇచ్చింది ఎస్పీఈఆర్టీ. ఏపీలో స్కూళ్లుకు జనవరి 10 నుంచి 19 వరకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏవైనా మార్పులు చేస్తే ముందుగానే ప్రకటిస్తామంది.
ఇదిలా ఉండగా ఉద్యోగులకు కూడా గుడ్‌న్యూస్. ముఖ్యంగా సంక్రాంతికి ఊరెళ్లే సాఫ్ట్‌వేర్లకు ఇది బంపర్ గుడ్‌న్యూస్ ఎందుకంటే వరుసగా నాలుగు రోజులు సెలవులు రాబోతున్నాయి. దీంతో వారు సంక్రాంతికి ఊరు వెళ్లడానికి ముందుగానే సిద్ధమైతున్నారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ప్రతి శనివారం, ఆదివారం సెలవు ఉంటుంది. ఇది రెండు రోజులు, సోమవారం 13, మంగళవారం 14 కూడా సెలవు రోజుగా ప్రకటించారు. దీంతో వారికి వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి.
సంక్రాంతి పండుగకు ప్రతి ఒక్కరూ ఊరు వెళ్లాలని చూస్తారు. ఏ ఊళ్లో ఉన్న సొంత ఊరికి చేరుకుంటారు. లాంగ్ వీకెండ్ ఇలా కలిసిరావడంతో దూర ప్రాంతాలు, టూర్స్ వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నెలలోనే జనవరి 26 కూడా మరో హాలిడే రానుంది(నోట్: ఈ సెలవులు కంపెనీని బట్టి మారుతుంటాయి)