Most Profitable Dubbing Movies: తెలుగు సినీ పరిశ్రమలో డబ్బింగ్ సినిమాల హవా అనేది ఎప్పటి నుంచో ఉంది. వేరే భాషలో హిట్టైన చిత్రాలు తెలుగు సినిమాలకు మించి వసూళ్లను సాధించిన సందర్భాలున్నాయి. ఈ యేడాది తెలుగులో డబ్ అయిన తమిళ డబ్బింగ్ మూవీ ‘అమరన్’ ఇక్కడ కూడా భారీ వసూళ్లను సాధించింది.
కథ బాగుంటే.. తెలుగు సహా ఇతర భాష ప్రేక్షకులు ఆయా చిత్రాలను హిట్ చేసిన సందర్భాలు కోకొల్లలు. ఈ యేడాది అమరన్ మూవీ తెలుగులో అత్యధిక లాభాలను తీసుకొచ్చిన చిత్రంగా నిలిచింది.
జైలర్.. సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘జైలర్’. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.12 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగు స్టేట్స్ లో తెలుగులో దాదాపు రూ. 56 కోట్ల షేర్ (రూ. 100 కోట్ల గ్రాస్)వసూళ్లను రాబట్టింది. అంతేకాదు ఓవరాల్ బిజినెస్ పై రూ. 35.90 కోట్ల లాభాలను తీసుకొచ్చి టాప్ లో కొనసాగుతోంది.
కాంతార.. రిషబ్ శెట్టి కథానాయకుడిగా యాక్ట్ చేస్తూ డైరెక్షన్ చేసిన చిత్రం ‘కాంతార’. తెలుగు స్టేట్ లో ఈ సినిమా రూ. 2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంతేకాదు ఇక్కడ రూ. 27.65 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. మొత్తంగా తెలుగులో రూ. 30 కోట్ల షేర్ (రూ. 60 కోట్ల గ్రాస్) వసూళ్లతో దుమ్ము దులిపింది.
అమరన్.. శివకార్తీకేయన్ హీరోగా సాయి పల్లవి కథానాయికగా యాక్ట్ చేసిన చిత్రం ‘అమరన్’. ఈ చిత్రం తెలుగులో రూ. 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవరాల్ గా ఈ సినిమా మొత్తం బిజినెస్ పై తెలుగులో టోటల్ రన్ లో రూ. 28 కోట్ల షేర్ సాధించింది. మొత్తంగా రూ. 23 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. టాప్ 3లో నిలిచింది.
బిచ్చగాడు.. విజయ్ ఆంటోని హీరోగా యాక్ట్ చేసిన మూవీ ‘బిచ్చగాడు’. కేవలం ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువగా రూ. 50 లక్షల బిజినెస్ చేసింది. ఓవరాల్ గా ఈ సినిమా రూ. 17.30 కోట్ల షేర్ (రూ. 33 కోట్ల గ్రాస్) వసూల్లతో కొన్ని బయ్యర్స్ ను కోటీశ్వరులను చేసింది. ఓవరాల్ గా ఈ సినిమా తెలుగులో రూ. 16.30 కోట్లకు పైగా లాభాలను తీసుకొచ్చింది.
మొత్తంగా తెలుగులో విడుదలైన ఇతర భాషకు సంబంధించిన డబ్బింగ్ చిత్రాల్లో కంటెంట్ బాగుంటే.. దాన్ని ఆదరిస్తారనడానికి ఈ సినిమాలకు వచ్చిన వసూల్లే ప్రామాణికం అని చెప్పాలి.