Business Ideas 2025: పెట్టుబడి తక్కువ.. లాభాలు ఎక్కువ.. ఇంట్లోనే కూర్చుండి లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు మీకోసం

Business Ideas: ప్రస్తుత రోజుల్లో చాలామంది రెండో ఆదాయ మార్గం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. జీతం సరిపోకపోవడం.. ఖర్చులు పెరగడం వంటి కారణాలతో బిజినెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే పెట్టుబడి విషయంలో  వెనకడుగు వేస్తున్నారు.  అయితే మీరు ఇంట్లోనే కూర్చుండి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే బిజినెస్ ప్రారంభించాలి అనుకుంటే ఈ పది బిజినెస్ ఐడియాలు మీకోసం..
 

1 /12

Business Ideas: నేటి కాలంలో ఖర్చులు ఏ విధంగా పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెల నెలా జీతం వచ్చేవారు సైతం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. మనకు డబ్బు అనేది చాలా ముఖ్యమైనది. బతుకు బండి నడవాలంటే డబ్బు అనే  ఇంధనం కావాల్సిందే.  డబ్బులు లేకుంటే బతుకు బండి ముందుకు సాగడం చాలా కష్టం. డబ్బుల కోసం కొందరు ఉద్యోగాలు చేస్తుంటారు. మరి కొందరు కూలి పనులు చేస్తుంటారు. ఎవరికి నచ్చిన పని వారు చేస్తుంటారు. కొందరు వ్యాపారం చేస్తుంటారు. సొంత వ్యాపారం అంటే తమకాలపై తమ నిలబడొచ్చని అంతా భావిస్తుంటారు. 

2 /12

ఇటీవల కాలంలో రెండో ఆదాయం కోసం చాలామంది చిన్న చిన్న బిజినెస్ లు ప్రారంభిస్తూనే ఉన్నారు. అయితే చాలామందికి ఏ బిజినెస్ చేయాలో తెలియక ఇబ్బందులు పడుతుంటారు. కొందరు కనిపించిన దాంట్లో డబ్బులు పెట్టి  నష్టపోతున్నారు. అందుకే ఏ బిజినెస్ ప్రారంభించిన ముందుగా అన్ని విషయాలు తెలుసుకోవాలి. పెట్టుబడి సమకూర్చుకోవాలి. తక్కువ పెట్టుబడితే  రిస్క్ తక్కువగా ఉండే వాటిని ఎంచుకుంటే మంచిది. అందుకే మీరు తక్కువ పెట్టుబడితో ఎక్కువగా లాభాలు పొందాలంటే ఈ బిజినెస్ లపై ఓ లుక్ చేయండి.  

3 /12

క్లౌడ్ బేకరీ: చాలామంది మహిళలకు బేకరీ ఐటమ్స్ చేయడం అలవాటుగా ఉంటుంది. అయితే మీకు కూడా అలాంటి అలవాటు ఉన్నట్లయితే మీ ఇంట్లోనే క్లౌడ్ బేకరిని ప్రారంభించవచ్చు. మీరు తయారు చేసిన ఉత్పత్తులను ఆన్లైన్ మార్కెట్లో సేల్ చేస్తే మంచి ఆదాయం పొందవచ్చు. దీనికోసం మీరు ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ భాగస్వామితో కలిసి మీరు పని చేస్తే మంచి ఆదాయాన్ని పొందవచ్చు.

4 /12

ఆన్లైన్ తరగతులు: ఆన్ లైన్ ట్యూషన్స్ చెప్పడం ద్వారా కూడా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. మీరు ఇంట్లోనే ఉండి ఫ్రీ స్కూల్ హై స్కూల్ వరకు ట్యూషన్స్ చెప్పినట్లయితే మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. కానీ మీకు కావాల్సిందల్లా జ్ఞానం అనుభవం మాత్రమే.   

5 /12

ఆన్లైన్ బొటిక్ .  ఫ్యాషన్ రంగానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. మీరు ఆన్ లైన్ ద్వారా బొటిక్ రన్ చేయవచ్చు. ఆన్ లైన్ లోనే ఆర్డర్స్ తీసుకుని అవి పూర్తయిన తర్వాత కస్టమర్స్ కు డోర్ డెలివరీ చేస్తే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. 

6 /12

గ్రాఫిక్ డిజైన్  మీరు గ్రాఫిక్ డిజైన్ ట్రాన్స్లేషన్, ఫోటో, వీడియో ఎడిటింగ్, లేదా కంటెంట్ రైటింగ్, వంటివి మీ అభివృద్ధికి సంబంధించి ఏదైనా ఒక ప్రాంతంలో స్కిల్స్ ఉంటే  రిమోట్ పనిచేయడం కూడా ప్రారంభించవచ్చు. వీటి ద్వారా మంచి ఆదాయం ఉంటుంది.   

7 /12

టిఫిన్ సెంటర్ నేటి కాలంలో  చాలామంది ఇంట్లోనే వండిన ఆహారానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీరు దీన్ని క్యాష్ చేసుకోవచ్చు. ఎలాగంటే మీరు ఇంట్లోనే కొన్ని రకాల టిఫిన్లను తయారు చేసి ఉద్యోగులకు, విద్యార్థులకు సరఫరా చేసినట్లయితే మంచి లాభాలను పొందవచ్చు. ఈ టిఫిన్లను డెలివరీ చేయడానికి ఫుడ్ డెలివరీ యాప్స్ తో మీరు భాగస్వాములు అయితే మీ బిజినెస్ ఈజీగా జనాల్లోకి వెళ్తుంది.  

8 /12

డే కేర్ సెంటర్  మీరు ఈ బిజినెస్ ప్రారంభించాలంటే మీకు కావాల్సింది మీ ఇంట్లో కొంచెం ఖాళీ స్థలం. ఇంట్లో ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణ ఉంటే మీరు డేకర్ సెంటర్ ను ప్రారంభించవచ్చు. ఎందుకంటే నేటి కాలంలో చాలామంది మహిళలు ఉద్యోగాల్లో బిజీగా ఉంటున్నారు. అలాంటివారు తమ పిల్లలను డేకేర్ సెంటర్లో వదిలేసి వెళుతున్నారు. సో మీరు దీన్ని క్యాష్ చేసుకోవచ్చు.

9 /12

డేటా ఎంట్రీ డేటా ఎంట్రీ చేయాలంటే మీకు కంప్యూటర్ ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం.  వీటి ద్వారా కూడా మంచి ఆదాయం ఉంటుంది.   

10 /12

బహుమతులు ఇంట్లో ఖాళీగా కూర్చోడం కంటే పుట్టిన రోజులు, వార్షికోత్సవాలు, పండగలు, మరి ఇతర ముఖ్యమైన ఈవెంట్ల కోసం ప్రత్యేకమైన సందర్భంలో  ఇచ్చే బహుమతులు మీరు తయారు చేయవచ్చు. వాటికి అవసరమైన క్లైంట్స్ కు  అందించవచ్చు   

11 /12

చేతితో తయారుచేసిన క్రాఫ్ట్స్ మీరు హోం క్రాఫ్ట్ బిజినెస్ ప్రారంభించవచ్చు. ఇందులో నగలు, రేసిస్ ఉత్పత్తులు, ఎంబ్రాయిడరీ వస్తువులు, పెయింటింగ్స్, కొవ్వొత్తులు, మొదలైన క్రాఫ్ట్ వ్యాపారాలు అత్యంత డిమాండ్ ఉన్నాయి. మార్కెట్లో ఈ లాభదాయకమైన క్రాఫ్ట్ ఐడియాలు మీకు మంచి ఆదాయాన్ని సమకూరుస్తాయి.

12 /12

మీరు యూట్యూబ్ ఛానల్ ను క్రియేట్ చేసుకుని వంట చేయడం, తోట పని, చేతులతో తయారు చేసిన క్రాఫ్ట్ లు, ఫ్యాషన్, బ్యూటీ ట్యుటోరియల్ మొదలైన  వీడియోలు పోస్ట్ చేసినట్లయితే మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు,