Business Ideas: ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు..ఇంట్లో కూర్చుని 5 లక్షలు సంపాదించే బిజిజెస్ ప్లాన్ ఇదే

Small Business Ideas: నిరుద్యోగ యువత ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా మీ ముందు పెట్టాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు సంవత్సరంలో 365 రోజులు ఉపాధి కల్పిస్తుంది. అంతే కాదు మీకు పెద్ద మొత్తంలో ఆదాయం కూడా లభిస్తుంది. ఈ బిజినెస్ గురించి తెలుసుకుందాం.

1 /7

Best Business Ideas: నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ కాలం వృధా చేసే కన్నా చక్కటి వ్యాపారాలను ప్రారంభించి పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.  ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఉపాధికి అవకాశాలు పెరిగాయి వీటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే,  పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకున్న అవకాశం లభిస్తుంది.

2 /7

ముఖ్యంగా ఫుడ్ డెలివరీ యాప్స్, అలాగే కడుపులో డెలివరీ యాప్స్, కమ్యూటింగ్ యాప్స్  వంటివి విస్తృతమైన ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి.  ప్రస్తుతం మనం ఇంటి వద్ద ఉంటూనే ప్రతి నెల లక్షల్లో ఆదాయం పొందే ఓ బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందుకోసం మీరు ఒకసారి పెట్టుబడి పెడితే చాలు ప్రతినెల పెద్ద మొత్తంలో మీరు డబ్బు సంపాదించుకున్న అవకాశం లభిస్తుంది.    

3 /7

ప్రస్తుతం మనం తెలుసుకోబోయే బిజినెస్ ప్లాన్ క్లౌడ్ కిచెన్. ప్రస్తుతం నగరాల్లోనూ పట్టణాల్లోనూ ఈ క్లౌడ్ కిచెన్ సంస్కృతి బాగా పెరిగిపోయింది. సాధారణంగా మీరు ఒక పెద్ద రెస్టారెంట్ లేదా హోటల్ పెట్టాలి అనుకుంటే, మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. అంతేకాదు ఇందుకోసం మీరు రెస్టారెంట్ డిజైన్ చేయించుకోవాలి. అలాగే  మీరు ఏర్పాటు చేసుకున్న రెస్టారెంట్ ప్రైమ్ లొకేషన్లో ఉండాలి. అప్పుడే మీరు ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు.   

4 /7

క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్ ఇదే: కానీ ఈ క్లౌడ్ కిచెన్ కాన్సెప్ట్ లో  మీరు కేవలం ఒక మంచి కిచెన్ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది.ఫుడ్ ఆర్డర్లను మీరు ఆన్లైన్ ద్వారా పొందవచ్చు.  ఇందుకోసం మీరు స్విగ్గి, జొమాటో వంటి  అగ్రికెటర్ల ద్వారా ఒప్పందం చేసుకొని ఫుడ్ డెలివరీ సర్వీసులను అందిస్తే సరిపోతుంది.  క్లౌడ్ కిచెన్ ఏర్పాటు కోసం మీరు రెస్టారెంట్ లో ఏ విధంగా అయితే కిచెన్ ఏర్పాటు చేస్తారో అలాగే మీ ఇంటి వద్ద కిచెన్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు పెట్టుబడి ఒకేసారి పెట్టాల్సి ఉంటుంది.    

5 /7

మంచి రెస్టారెంట్ కిచెన్ కోసం ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అంతేకాదు క్లౌడ్ కిచెన్ నిర్వహణ కోసం మీరు స్థానికంగా మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే   కంపెనీ రిజిస్టర్ చేయించుకోవాలి.దీనికి తోడు FSAAI నుంచి  ఫుడ్ సెక్యూరిటీ  వారి సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. అలాగే జీఎస్టీ నెంబర్ కూడా తీసుకోవాలి.  

6 /7

ఇప్పుడు మీరు క్లౌడ్ కిచెన్ ఏర్పాటు చేసుకొని ఆర్డర్ల కోసం  స్విగ్గి, zomato యాప్ లో మీ కిచెన్  నమోదు చేసుకొని ఆర్డర్లు పొందవచ్చు.  అంతేకాదు మీరు కూడా మీ కిచెన్ సమీపంలోని ఐదు కిలోమీటర్ల పరిధిలో  ఫోన్ ద్వారా  ఆర్డర్లను పొంది. డెలివరీ బాయ్స్ ద్వారా వారికి ఫుడ్ చేరవేస్తే  మీ కంపెనీకి మరింత లాభం వచ్చే అవకాశం ఉంది.    

7 /7

ఈ క్లౌడ్ కిచెన్ ద్వారా  మీరు పొందే ఆర్డర్లను బట్టి ప్రతినెలా ఐదు లక్షల వరకు లాభం పొందే అవకాశం ఉంది. వెజ్, నాన్ వెజ్, బిర్యానీ, చైనీస్, మొఘలాయి, నార్తిండియన్ రుచులను  అందించడం ద్వారా మీరు పెద్ద మొత్తంలో లాభం పొందే అవకాశం ఉంది. అలాగే సందర్భాన్ని బట్టి ఆఫర్లను అందిస్తే మీకు సేల్స్ పెరిగే అవకాశం ఉంటుంది.