Business Ideas: కేవలం 2500 రూ.లకే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఈ కోర్సు నేర్చుకుంటే.. నెలకు రూ. 1 లక్ష పక్కా

Small Business Ideas: మీరు సొంతంగా బిజినెస్ ఏర్పాటు చేసుకొని స్థిరపడాలి అనుకుంటున్నారా. ఉద్యోగం చేయడం వల్ల వచ్చే ఆదాయం సరిపోవడం లేదా. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉపాధి శిక్షణ సంస్థలో అతి తక్కువ ఫీజుకే కోర్సు నేర్చుకుని వ్యాపార రంగంలో ప్రవేశించవచ్చు ఎలాగో తెలుసుకుందాం.
 

1 /6

Best Business Ideas: మహిళలు మీరు మీ సొంత కాళ్ళ పైన నిలబడి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని అనుకుంటున్నారా అయితే ప్రస్తుతం ఒక చక్కటి బిజినెస్ ఐడియాతో మీరు స్వతంత్రంగా ఒక ఆర్థిక శక్తిగా మారే అవకాశం లభిస్తుంది. ఇందుకోసం మీరు స్వశక్తితో సంపాదించుకోవడానికి నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది.  ప్రస్తుత ఆధునిక యుగంలో నైపుణ్యం ఉన్నవారికి డబ్బు సంపాదించుకోవడానికి కొదవలేదని చెప్పవచ్చు.  చిన్న చిన్న నైపుణ్యాలు నేర్చుకోవడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించుకునే అవకాశం లభిస్తుంది.    

2 /6

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన సెట్విన్ సంస్థ హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని నిరుద్యోగ యువతీ యువకులకు అనేక కోర్సుల్లో శిక్షణను అందిస్తోంది. నగరంలో పలు బ్రాంచీలను కలిగి ఉన్న ఈ ప్రభుత్వ సంస్థ  అతి తక్కువ కోర్సు ఫీజులకే నిరుద్యోగ యువతీ యువకులకు పలు రంగాల్లో పలు వృత్తి నైపుణ్య శిక్షణ  కోర్సులు అందిస్తోంది.  ప్రస్తుతం ఈ కోర్సుల్లో మహిళలకు ఉపయోగపడే ఒక కోర్సు గురించి తెలుసుకుందాం ఈ కోర్సు నేర్చుకోవడం ద్వారా మీరు ప్రతిరోజు మంచి ఆదాయం పొందే అవకాశం లభిస్తుంది.   

3 /6

అదే బ్లౌజ్ డిజైనింగ్ కోర్సు ఈ కోర్సు సెట్విన్ సంస్థ కేవలం 2500 రూపాయలకే  అందిస్తోంది.  అది కూడా మూడు నెలల పాటు నేర్పిస్తుంది.  నైపుణ్యం కలిగిన నిపుణులు శిక్షకులు ఈ కోర్సు నేర్పిస్తారు.  తద్వారా మహిళలు ఈ కోర్సు నేర్చుకుని తమ స్వయం ఉపాధిని పొందే అవకాశం ఉంటుంది.  లేదా మంచి బోటిక్స్ లో కూడా పని చేయవచ్చు.  తద్వారా మీకు మంచి ఆదాయం లభిస్తుంది. ఈ కోర్సు నేర్చుకున్న వారికి సెట్విన్ సంస్థ సర్టిఫికెట్ కూడా జారీ చేస్తుంది. సెట్విన్ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఉపాధి శిక్షణా సంస్థ.   

4 /6

 బ్లౌజ్ డిజైనింగ్ కోర్సు మూడు నెలల పాటు ఉంటుంది దీని ఫీజు కేవలం 2500 రూపాయలు మాత్రమే.  ఈ శిక్షణ పొందిన అనంతరం సర్టిఫికెట్ కూడా పొందుతారు.  ఆ తర్వాత మీరు సొంతగా షాపు పెట్టుకోవచ్చు.  తద్వారా మీరు ప్రతిరోజు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.  ప్రస్తుతం మార్కెట్లో ఒక బ్లౌజ్ కుట్టేందుకు  కనీసం 200 రూపాయల నుంచి  గరిష్టంగా ఐదు వేల రూపాయల వరకు చార్జీ చేస్తున్నారు.  

5 /6

రోజుకు కనీసం నాలుగు బ్లౌజులు కొట్టుకున్న 2000 రూపాయల నుంచి  పదివేల రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. డిజైనింగ్ బ్లౌసులకు ఎక్కువగా ఛార్జ్ చేయవచ్చు.  అలాగే బ్లౌజులపై మగ్గం వర్క్ చేసినట్లయితే మరింత ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.  

6 /6

 ఈ బ్లౌజ్ డిజైన్ నేర్చుకొని మీరు సొంతంగా వ్యాపారం చేయడం ద్వారా నెలకు 50 వేల రూపాయల నుంచి ఒక లక్ష రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది.  మీరు సొంతంగా షాపు ఏర్పాటు చేసుకోలేరు అనుకున్నట్లయితే మీ ఇంటి వద్దనే ఒక బోర్డు లేదా ఫ్లెక్సీ పెట్టుకొని ఆర్డర్లను పొందవచ్చు.