Business Tips 2023: మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారా..? ఈ టిప్స్ పాటిస్తే భారీ లాభాలు

Small Business Ideas: మీకు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన ఉంటే.. ముందు పక్కా ప్రణాళిక వేసుకోవడం చాలా ముఖ్యం. మీరు సరైన వ్యాపారాన్ని ఎంచుకుంటే.. మీ సక్సెస్ అయినట్లే. మీరు విక్రయించే వాటి గురించి ప్రజల అభిప్రాయాలు కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. బిజినెస్ సక్సెస్ కావాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. 

  • Mar 22, 2023, 00:26 AM IST
1 /5

వ్యాపారం చేయడం అంత తేలికైన పని కాదు. వ్యాపారస్తులు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు మొదటిసారిగా వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నట్లయితే.. మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి.   

2 /5

ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు.. మీరు విక్రయించబోయే దానికి మార్కెట్‌లో ఎలా డిమాండ్ ఉందో తెలుసుకోవాలి. మీ కొనుగోలుదారులు ఎవరు..? మీ వ్యాపారం మార్కెట్ కెపాసిటీ ఎంత..? మీ వ్యాపారంలో ఎంత లాభం సాధ్యమవుతుందో బెరీజు వేసుకోవాలి.  

3 /5

కస్టమర్ ఎంత రిపీటెడ్‌గా మీ వస్తువును కొంటాడో మీరు అంత లాభపడతారు. ఇలాంటివి మార్కెట్‌లో అనాలాసిస్ చేసి వ్యాపారాన్ని ప్రారంభించండి.  

4 /5

మీరు ఆదాయానికి బదులుగా లాభంపైనే దృష్టి పెట్టండి. చాలా మంది వ్యాపారవేత్తలు ఆదాయం వైపు చూస్తారు. మీరు లాంగ్‌ టర్మ్‌లో బిజినెస్ రన్ చేయాలనుకుంటే.. ఆదాయం వైపు కాకుండా లాభం వైపు చూడాలి.    

5 /5

మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్లయితే ముందుగా చిన్నగా ప్రారంభించండి. ఆ తరువాత మెల్లగా విస్తరించండి. నెమ్మదిగా స్కేలింగ్ చేయడం ద్వారా.. కస్టమర్లు మీపై నమ్మకం పెంచుకుంటారు. మీరు చాలా పెద్ద వ్యాపారాలను కూడా పరిశీలించినా.. మొదట ప్రారంభంలో ఆ వ్యాపారాలు చిన్నవిగానే ఉంటాయి.