Car AC Compressor: కారు ఏసీ కంప్రెషర్ ఎందుకు పాడవుతుందో తెలుసా, ఈ టిప్స్ పాటించండి చాలు

ఏసీ లేకుండా కారు జర్నీ అంటే అంతకంటే అసౌకర్యం మరొకటి ఉండదు. కారు ఏసీకు మూలం కంప్రెషర్. ఇది రెఫ్రిజరెంట్ గ్యాస్‌ను వేగవంతం చేసి కూల్ చేస్తుంది. తద్వారా ఏసీ నుంచి చల్లని గాలి వస్తుంది. కారులో ఏసీ సరిగ్గా రావడం లేదంటే కంప్రెషర్ పాడయినట్టు అర్ధం. కంప్రెషర్ ఎందుకు పాడవుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

Car AC Compressor: ఏసీ లేకుండా కారు జర్నీ అంటే అంతకంటే అసౌకర్యం మరొకటి ఉండదు. కారు ఏసీకు మూలం కంప్రెషర్. ఇది రెఫ్రిజరెంట్ గ్యాస్‌ను వేగవంతం చేసి కూల్ చేస్తుంది. తద్వారా ఏసీ నుంచి చల్లని గాలి వస్తుంది. కారులో ఏసీ సరిగ్గా రావడం లేదంటే కంప్రెషర్ పాడయినట్టు అర్ధం. కంప్రెషర్ ఎందుకు పాడవుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

1 /5

కారు ఏసీ కంప్రెషర్ సమయం గడిచే కొద్దీ దెబ్బతింటుంది. మీ కారు కంప్రెషర్ పదేళ్లు దాటి ఉంటే పాడయ్యే అవకాశాలు అధికం

2 /5

మీ కారు ఏసీ సిస్టమ్ వేడెక్కుుతుంటే కంప్రెషర్ బాగాలేదని అర్ధం. లేదా కంప్రెషర్ దెబ్బతినవచ్చు. కారు ఏసీ వేడెక్కడానికి చాలా కారణాలుంటాయి. రెఫ్రిజిరెంట్ గ్యాస్ తగ్గిపోవడం, ఫ్యాన్ పాడవడం, ఎయిర్ ఫిల్టర్ శుభ్రంగా లేకపోవడం.

3 /5

విద్యుత్ షార్ట్ సరఫరా లేదా ఫ్యూజ్ కాలిపోయినప్పుుడు కూడా కంప్రెషర్ పాడవుతుంటుంది.

4 /5

రెఫ్రిజిరెంట్ గ్యాస్ అన్నింటికంటే ప్రధాన కారణం. ఏసీ సిస్టమ్‌లో ఎక్కడైనా లీక్ ఉంటే రెఫ్రిజిరెంట్ గ్యాస్ తగ్గిపోతుంది. కంప్రెషర్ సరిగ్గా పనిచేయదు. దాంతో పాడయ్యే అవకాశాలెక్కువగా ఉంటాయి.

5 /5

కంప్రెషర్ సరిగ్గా పనిచేయాలంటే ఆయిల్ అవసరం ఉంటుంది. కంప్రెషర్ ఆయిల్ పరిమాణం తగ్గితే లేదా ఆయిల్ పాడయితే కంప్రెషర్ పాడవుతుంది.