Ilachi Remedies: ప్రకృతిలో లభించే వివిధ రకాల పదార్ధాలు ముఖ్యంగా మసాలా దినుసుల్లో శరీరం ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో అతి ముఖ్యమైంది ఇలాచీ. ఇందులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ రాత్రి పూట కేవలం 2 ఇలాచీలు తింటే చాలు..అద్బుతమైన ప్రయోజనాలు మీ సొంతం.
ఇలాచీ రోజు క్రమం తప్పకుండా తినడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గించుకునే ప్రక్రియలో అద్భుతంగా దోహదపడుతుంది. శరీరంలో పేరుకున్న కొవ్వు కరుగుతుంది.
రోజూ రాత్రి పడుకునేటప్పుడు 2 ఇలాచీలు నమిలి తినడం అలవాటు చేసుకుంటే నోటి దుర్వాసన దూరమౌతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది
రోజూ రాత్రి పడుకునే ముందు 2 ఇలాచీలు నోట్లో పెట్టుకోవాలి. నెమ్మది నెమ్మదిగా నములుతూ మింగుతుండాలి. ఇలా చేయడం వల్ల నిద్ర కూడా అద్భుతంగా పడుతుంది.
రాత్రి పడుకునే ముందు ఇలాచీ తినడం అలవాటు చేసుకుంటే గ్యాస్, కడుపు సమస్యలు దూరమౌతాయి నోటి నుంటి దుర్వాసన పోతుంది. శరీరంలోని ఇతర అవయవాలు మెరుగ్గా మారతాయి