Lakhpati Didi Yojana Scheme: రేషన్ కార్డు హోల్డర్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్. మహిళల కోసం రూ.5 లక్షల వరకు బిజినెస్ లోన్ కేంద్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఆ పథకం ఎక్కడ ఉందా అని ఆలోచిస్తున్నారా..? కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లఖ్ పతి దీదీ పథకం గురించి మీకు తెలుసా..! ఈ స్కీమ్‌కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? ఏ పత్రాలు కావాలి..? పూర్తి వివరాలు ఇలా..
మహిళల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక స్కీమ్స్‌ను ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. వీటిలో లఖ్ పతి దీదీ పథకం ఒకటి.
మీ వద్ద రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే.. మీరు కేంద్ర ప్రభుత్వం లఖ్ పతి దీదీ పథకం కింద రూ.5 లక్షల బిజినెస్ లోన్ తీసుకోవచ్చు. ఈ డబ్బుకు మీరు వడ్డీ చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. అందులో సబ్సిడీ కూడా ఉంటుంది.
మహిళా స్వయం సహాయక బృందాలలో (SHG) సభ్యులుగా ఉన్న మహిళలు ఈ స్కీమ్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ రాష్ట్రానికి చెందిన మహిళలు ఆ రాష్ట్రంలోనే అప్లై చేసుకోవాలి.
కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగంలో ఎవరైనా ఉంటే అనర్హులు.
ఈ పథకంలో భాగంగా మహిళలకు నైపుణ్య శిక్షణ అందించి.. స్వయం ఉపాధి కోసం లోన్ కూడా ఇస్తారు. ఈ డబ్బుతో బిజినెస్ ప్రారంభించవచ్చు.
ఎల్‌ఈడీ బల్బుల తయారీ, ప్లంబింగ్, డ్రోన్ రిపేర్లలలో మహిళలకు శిక్షణ ఇస్తారు. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఎస్‌హెచ్‌జీ సెంటర్‌లో గానీ, అంగన్‌వాడీ కేంద్రంలో సంప్రదించాలి.
రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, మహిళా స్వయం సహాయక బృందం సభ్యత్వ రుజువు, నివాస ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబర్ ఉండాలి. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు అర్హులు.
ఈ పథకాన్ని ఎక్కువగా ఉత్తరాధి రాష్ట్రాల్లో మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం https://lakhpatididi.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేయండి.