Chaitra Purnima 2024: ఈరోజు నుంచి ఈ 6 రాశులకు అదృష్టం బంకలా పట్టుకుంటుంది! ఇందులో మీ రాశి ఉందా?

Chaitra Purnima 2024: నేడు చైత్ర పూర్ణిమ అంతేకాదు హనుమాన్ జయంతి కూడా. ఈరోజు నుంచి 6 రాశులవారి దశతిరగనుందట.

Chaitra Purnima 2024: నేడు చైత్ర పూర్ణిమ అంతేకాదు హనుమాన్ జయంతి కూడా. ఈరోజు నుంచి 6 రాశులవారి దశతిరగనుందట. ఆంజనేయస్వామి కృపతో అదృష్టం, ఆనందం వీరి సొంతమట. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్‌ చేయండి.
 

1 /6

సింహ రాశి వారికి జీవితంలో కష్టాలు తొలగిపోతాయి. ఈ రాశివారికి చైత్ర పౌర్ణమి నుంచి కుటుంబ మద్దతు పెరుగుతుంది. దీంతో కుటుంబంతో ఆనందంగా కొనసాగుతారు. వీళ్లు కోరుకున్న ఉద్యోగం కూడా దొరికే ఛాన్స్‌ ఉంటుంది.

2 /6

ఈరోజు నుంచి మేషరాశివారికి లాభాలే లాభాలు. పెళ్లికానివారికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యాపారాల్లో భారీ లాభాలు పొందుతారు. ఆ ఆంజనేయ స్వామి కృపతో మీ ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అంతేకాదు కుటుంబంతో సఖ్యత నెలకొంటుంది.  

3 /6

ఈ రాశివారికి కూడా ఈరోజు నుంచి అదృష్టం తలుపుతట్టబోతుంది. ముఖ్యంగా మిథునరాశివారికి కోరుకున్న ఉద్యోగం పొందుతారు. ఈ సమయంలో కొత్త ప్రాజెక్టులు కూడా మీ ముందుకు వస్తాయి. పని ప్రదేశంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు.  

4 /6

చైత్ర పౌర్ణమి సందర్భంగా ఈరోజు నుంచి కన్యరాశివారికి కూడా బాగా కలిసివస్తుంది. మీ జీవితంలో కొత్త మార్పులు చోటుచేసుకుంటాయి. కొత్త ప్రాజెక్టులు వస్తాయి. కన్యరాశివారికి శక్తి, తేజస్సు కూడా పెరుగుతుంది.   

5 /6

చైత్ర పూర్ణిమ కర్కాటక రాశివారికి కూడా శుభ పరిణామాన్ని చూపించనుంది. ఈ రోజు నుంచి ఈ రాశివారికి లక్కే లక్కు ముఖ్యంగా కుంటుంబ సభ్యులతో సంబంధం బలంగా మారుతుంది. భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు.   

6 /6

చైత్ర పూర్ణిమ నుంచి వృషభ రాశివారికి కూడా ఆనందం, అదృష్టం రెండూ కలిసి రానున్నాయి. వ్యాపారంలో భారీ లాభాలు పొందుతారు. పని చేసే చోట మంచి ప్రశంసలు పొందుతారు. ముఖ్యంగా వైవాహిక బంధంలో మంచి సఖ్యత కనిపిస్తుంది. (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)