Cloves Benefits: మనదేశంలో దాదాపుగా ప్రతి కిచెన్‌లో లభించే వివిధ రకాల గరం మాసాలా పదార్ధాలు ఆరోగ్యపరంగా ఎంత అద్బుతమైనవో చాలామందికి తెలియదు. చాలా వ్యాధులకు చికిత్స ఉంటుంది. ఇందులో ఒకటి లవంగం. వంటల్లో, స్వీట్స్‌లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. పూజాది కార్యక్రమాల్లో కూడా ఉపయోగిస్తారు. లవంగం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా మగవారి ఆరోగ్యం, సామర్ధ్యానికి లవంగం అద్భుతంగా ఉపయోగపడుతుంది.
స్పెర్మ్ క్వాలిటీ ఇటీవలి కాలంలో లైప్‌స్టైల్, ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోవడంతో మగవారిలో స్మెర్మ్ క్వాలిటీ కౌంట్ రెండూ తగ్గిపోతున్నాయి. లవంగంతో ఈ సమస్యను అధిగమించవచ్చు. లైంగిక సమస్యలకు లవంగం అద్భుతంగా పనిచేస్తుంది.
పంటి నొప్పులు లవంగంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పంటి ఆరోగ్యానికి చాలా మంచిది. పంటిలో ఉత్పన్నమయ్యే బ్యాక్టీరియా తొలగిపోతుంది. నొప్పిని దూరం చేస్తుంది.
టెస్టోస్టిరోన్ హార్మోన్ పెరుగుదల లవంగం తినడం వల్ల పురుషుల శరీరంలో టెస్టోస్టిరోన్ హార్మోన్ లెవెల్స్ పెరుగుతాయి. ఫలితంగా లైంగిక జీవితం సరిగ్గా ఉంటుంది. లవంగం పౌడర్‌ను పాలతో తీసుకోవాలి.
రోగ నిరోధక శక్తి పెంపు లవంగంను ఇమ్యూనిటీ పెంచేందుకు ఉపయోగిస్తారు. ఇందులో ఉండే విటమిన్ సి, జింక్ శరీరంలో రోగ నిరోధక శక్తని పెంచుతాయి. అంతేకాకుండా తలనొప్పి, జలుబు, జ్వరం వంటి సీజనల్ సమస్యల ముప్పు తగ్గుతుంది.
రక్తపోటు నియంత్రణ లవంగంలో పెద్దఎత్తున లభించే మెగ్నీషియం, పొటాషియం, మినరల్స్ కారణంగా రక్త పోటు నియంత్రణలో ఉంటుంది. బీపీ రోగులకు చాలా మంచిది.