CM Revanth: సీఎం రేవంత్ రెడ్డి ఆస్తి విలువ ఎంతో తెలుసా? ఏడీఆర్ నివేదిక షాకింగ్‌ రిపోర్ట్‌..!

CM Revanth Reddy Networth: ఏడీఆర్ నివేదిక నిన్న దేశంలో సంపన్నులైన ముఖ్యమంత్రుల జాబితాను విడుదల చేసింది. ఈ నివేదికలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి స్థానంలో ఉండగా .. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆఖరి స్థానంలో నిలిచారు. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ఏడీఆర్‌ నివేదికలో ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడి అయ్యాయి తెలుసుకుందాం..
 

1 /5

ఏడీఆర్ నివేదిక అంటే అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్. నిన్న దేశంలో అత్యం సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మొదటి స్థానంలో రూ.931 కోట్లతో నిలిచారు. ఇక చివరి స్థానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూ.15 లక్షలతో ఉన్నారు.  

2 /5

ఈ నివేదికలో చంద్రబాబు నాయుడు తర్వాత అరుణాచల్ సీఎం పేమా ఖాండు రెండో స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తి విలువ రూ. 330 కోట్లు. ఆ తర్వాత స్థానంలో కర్నాటక సీఎం సిద్ధరామయ్య రూ.51 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆస్తుల విలువ తెలుసుకుందాం.  

3 /5

సీఎం రేవంత్ రెడ్డి ఆస్తుల విలువ ఎంత ఉంటుందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఏడీఆర్ నివేదిక ప్రకారం సీఎం తెలంగాణ సీఎం ఆస్తుల విలువ రూ. 30 కోట్లని తెలిపింది. ఈయన ఏడో స్థానంలో నిలిచారు. అయితే రేవంత్ రెడ్డికి 1.3 కోట్లు అప్పులు కూడా ఉన్నాయి. ఆయన ఆదాయం 13 లక్ష

4 /5

అట్టడుగు స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రుల జాబితాలో ఆస్తులు కేరళ సీఎం పినరాయి విజయన్‌ రూ.1.19 కోట్లతో నిలిచారు ఓమర్ అబ్దుల్ల రూ. 50 లక్షల ఆస్తులతో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్నారు. ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ లీడర్ మమతా బెనర్జీ 15 లక్షలతో చిట్టచివరి స్థానంలో ఉన్నారు  

5 /5

అయితే ఈ నివేదిక ప్రకారం ఈ ముఖ్యమంత్రుల్లో 13 మంది వరకు క్రిమినల్ కేసులు ఉన్నాయి. కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య తో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై కూడా కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఇక చివరి స్థానంలో ఉన్న మమతాను చూసి ఆస్తి విలువ అంతే ఉంటుందా? అని షాక్‌కు గురవుతున్నారు.