Coffee Precautions: రోజుకు ఎన్ని కప్పులు కాపీ తాగవచ్చు, అతిగా తాగితే ఏమౌతుంది

బెడ్ కాఫీ లేదా బెడ్ టీ లేనిదే చాలామందికి తెల్లారదు. ఉదయం లేచిన వెంటనే కాఫీ తాగితేనే ఉల్లాసం, ఉత్సాహం వచ్చినట్టుగా ఫీలవుతుంటారు. అయితే కాఫీ పరిమితి దాటి తాగితే ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అలాంటప్పుడు రోజుకు ఎన్ని కప్పుల కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం.

Coffee Precautions: బెడ్ కాఫీ లేదా బెడ్ టీ లేనిదే చాలామందికి తెల్లారదు. ఉదయం లేచిన వెంటనే కాఫీ తాగితేనే ఉల్లాసం, ఉత్సాహం వచ్చినట్టుగా ఫీలవుతుంటారు. అయితే కాఫీ పరిమితి దాటి తాగితే ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్పన్నం కావచ్చు. అలాంటప్పుడు రోజుకు ఎన్ని కప్పుల కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం.

1 /6

2 /6

మరి రోజుకు ఎంత కాఫీ తాగవచ్చనే ప్రశ్న వస్తుంది. నిపుణుల సూచనల ప్రకారం రోజుకు 400 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కాఫీ తాగడం మంచిదికాదు. అంటే దాదాపుగా 3 కప్పుల కాఫీ తాగవచ్చు. 

3 /6

ఇక ఎక్కువ మోతాదులో కాఫీ తాగడం వల్ల నిద్రలేమి, ఆందోళన, కంగారు వంటి సమస్యలు కన్పిస్తాయి. ఎసిడిటీ రావచ్చు. గుండె వేగాన్ని పెంచుతుంది. అధిక రక్తపోటు సమస్య రావచ్చు. గర్భిణీ మహిళలు కాఫీ అతిగా తాగితే పిల్లల బరువు తగ్గిపోతుంది.

4 /6

కాఫీ రోజూ తగిన మోతాదులో తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గించవచ్చు. కాఫీ తాగడం వల్ల డిప్రెషన్ కూడా తగ్గుతుంది. 

5 /6

కాఫీ తాగడం వల్ల ప్రయోజనాలు కూడా లేకపోలేదు. మెదడు హెల్తీగా ఉంటుంది. అల్జీమర్స్, పార్కిన్సన్ వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుంది. మధుమేహం ముప్పు కూడా తగ్గుతుంది. టైప్ 2 డయాబెటిస్ ముప్పు తగ్గుతుంది. 

6 /6

Coffee Precautions: కాఫీ పరిమితి దాటి తాగడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. ముఖ్యంగా ఆందోళన, నిద్రలేమి, అధిక రక్తపోటు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు.