Most Successful Batting Pairs In ODI Cricket: క్రికెట్‌లో మ్యాచ్ గెలవాలంటే భాగస్వామ్యలు నిర్మించడం చాలా కీలకం. ఇద్దరు బ్యాట్స్‌మెన్ల మధ్య సమన్వయం ఎంత బాగుంటే.. జట్టు విజయ అవకాశాలు అంతమెరుగ్గా ఉంటాయి. వన్డే క్రికెట్ చరిత్రలో టాప్ క్లాస్ బ్యాట్స్‌మెన్ల జోడీలపై ఓ లుక్కేయండి.
భారత క్రికెట్ దిగ్గజ జంట సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీ 176 వన్డే మ్యాచ్‌ల్లో 47.55 సగటుతో 8227 పరుగులు జోడించారు.
శ్రీలంక మాజీ ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్, మాజీ కెప్టెన్ కుమార సంగక్కర 104 వన్డే మ్యాచ్‌ల్లో కలిసి 5475 పరుగుల భాగసామ్యం నెలకొల్పారు.
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్లు మాథ్యూ హేడెన్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ జోడి క్రీజ్‌లో ఉందంటే ప్రత్యర్థి బౌలర్లకు వణుకే. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్లు 117 మ్యాచ్‌ల్లో 5409 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు.
మహేల జయవర్ధనే, కుమార సంగక్కర శ్రీలంక జట్టును ఎన్నో మ్యాచ్‌ల్లో విజయ తీరాలకు చేర్చారు. 151 వన్డే మ్యాచ్‌ల్లో 5992 పరుగులు జోడించారు.
రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ ఎన్నో మ్యాచ్‌ల్లో భారత్‌కు మెరుపు ఆరంభాలను ఇచ్చారు. వన్డేల్లో వీరిద్దరు కలిసి 5193 పరుగులు జోడించారు.
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ కేవలం 85 ఇన్నింగ్స్‌ల్లోనే 62.47 సగటుతో 4998 పరుగులు జోడించారు.