Delhi air quality index: దేశ రాజధాని ఢిల్లీ వాయుకాలుష్యంతో అతలాకుతలం అవుతుంది. కనీసం అక్కడ గాలి పీల్చుకునేందుకు కూడా జనాలు భయపడిపోయే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో అతిషీ మళ్లీ లాక్ డౌన్ వైపు మొగ్గుచూపుతున్నారని వార్తలు వస్తున్నాయి.
ఢిల్లీలో కొన్నిరోజులుగా వాయుకాలుష్యం పీక్స్ కు చేరింది. ఇప్పటికే ఢిల్లీలో ఎక్కడ చూసిన కూడా పొగ మంచు ఎక్కువగా కన్పిస్తుంది. కనీసం ఎదుటి నుంచి ఎవరు వస్తున్నారో కూడా కన్పించని స్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి ఏడాది.. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరీ వరకు విపరీతమైన చలిగాలులు వీస్తాయి. అంతే కాకుండా.. అక్కడ ఇతర రాష్ట్రాలలో పంట వ్యర్థాలను తగల పెట్టడం వల్ల ఆ పొగ అంతా ఢిల్లీకీ వస్తుంది.
దీంతో ఢిల్లీ వ్యాప్తంగా వాయుకాలుష్యం ఏర్పడిపోతుంది. ఇప్పటికే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం.. వాయునాణ్యత..500 దాటిందని తెలుస్తొంది. అసలు.. వాయునాణ్యత 300 దాటగానే.. ప్రభుత్వాల కీలక చర్యలు తీసుకొవాలి.
అలాంటిది ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 దాటినట్లు సమాచారం. దీంతో ఇప్పటికే అక్కడస్కూళ్లకు ఇంటినుంచి ఆన్ లైన్ క్లాసుల్ని నిర్వహిస్తున్నారు. మరోవైపు సాఫ్ట్ వేర్ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పిస్తున్నాయంట.
అంతే కాకుండా.. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అపోసిషన్ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. దీనికి సీఎం అతిషీ కూడా ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ లో ఇష్టమున్నట్లు పంట వ్యర్థాలు కాలపెట్టడం వల్లే.. ఢిల్లీకి ఈ పరిస్థితి ఏర్పడిందంటూ ఫైర్ అయ్యారు.
అక్కడ పంట వ్యర్థాలను తగలబెట్టడంను కంట్రోల్ చేస్తే.. ఢిల్లీ ఇంతటి దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొవాల్సిన అవసరం ఉండదని కూడా సీఎం అతిషీ అన్నట్లు తెలుస్తొంది. పంజాబ్ సర్కారు. . పంట వ్యర్థాలను కంట్రోల్ చేసిందని కూడా చెప్పుకొవచ్చు. మరోవైపు దీనిపై కేంద్రంలోని మోదీ సర్కారు కల్గజేసుకుని ఢిల్లీని ఆదుకొవాలని అతిషీ కోరినట్లు తెలుస్తొంది.