Delhi Elections 2025: మోగిన ఢిల్లీ ఎన్నికల భేరీ.. వేడెక్కిన హస్తిన రాజకీయాలు

Delhi Assembly Elections 2025 Dates Schedule: దేశ రాజధాని ఢిల్లీ ఎన్నికల నగారా మోగింది. జాతీయ రాజకీయాలకు కేంద్రమైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రకటన విడుదల కావడంతో రాజకీయాలు వేడెక్కాయి. ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల తేదీల సమగ్ర వివరాలు తెలుసుకుందాం.

1 /8

దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికల ప్రకటన విడుదలైంది. రాజకీయాలకు కేంద్రంగా నిలిచే ఢిల్లీకి ఎన్నికల ప్రకటన విడుదల కావడంతో రాజకీయాలు వేడెక్కాయి.

2 /8

70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు.

3 /8

ఎన్నికల ప్రకటనకు సంబంధించి ఎన్నికల సంఘం సమగ్ర వివరాలతో ప్రకటన విడుదల చేసింది.

4 /8

ఎన్నికల ప్రకటన జనవరి 10వ తేదీన విడుదల కానుండగా.. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జనవరి 17.

5 /8

నామినేషన్ల పరిశీలన జనవరి 18, నామినేషన్ల ఉపసంహరణ జనవరి 20వ తేదీన ఉంటాయి.

6 /8

70 స్థానాలకు ఒకేసారి ఫిబ్రవరి 5వ తేదీన పోలింగ్‌ జరగనుండగా.. 8వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి.

7 /8

మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 13,033 పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేయనుంది.

8 /8

మరోసారి ఆమ్‌ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చాలా సర్వేలు వెల్లడించాయి.