Daaku Maharaaj Exclusive Review: ‘డాకు మహారాజ్’ ఎక్స్‌క్లూజివ్ రివ్యూ.. బాలయ్య ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్..

Daaku Maharaaj Exclusive Review: నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో హాట్రిక్ హిట్స్ తో  పీక్స్ లో ఉన్నారు.  తాజాగా ఈయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’.  బాబీ కొల్లి డైరెక్ట్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సంయుక్తంగా నిర్మించారు. శ్రీకర ప్రొడక్షన్స్ సమర్ఫణలో ఈ సినిమా సంక్రాంతికి రాబోతుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా సెన్సార్ వాళ్లు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ రివ్యూ ప్రేక్షకుల కోసం..

1 /7

Daaku Maharaaj Exclusive Review: నందమూరి బాలకృష్ణ 60 ప్లస్ ఏజ్ లో దూకుడు మీదున్నారు. అంతేకాదు నట వారసుడిగా అడుగుపెట్టి గతేడాది హీరోగా 50 యేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రాబోతున్న ‘డాకు మహారాజ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి.

2 /7

అపుడెపుడో బాలయ్య.. సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిత్య 369’లో ఓ సన్నివేశంలో శ్రీకృష్ణ దేవరాయలు.. డాకు వేషంలో ఉరిశిక్ష వేసిన కృష్ణ కుమార్ ను కాపాడే సన్నివేశం ఉంటుంది. ఆ డాకు గెటప్ ను బేస్ చేసుకొని దర్శకుడు బాబీ ‘డాకు మహారాజ్’ ఈ సినిమాను తెరెక్కించినట్టు తాజాగా అన్ స్టాపబుల్ షోలో వెల్లడించారు.

3 /7

మొత్తంగా డాకు మహారాజ్ టైటిల్ తోనే ఈ సినిమాపై పాజిటివ్ వైబ్రేట్స్ క్రియేట్ చేశాడు బాబీ. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.  ఈ  కథ వెలుగులు పంచే దేవుళ్లది కాదు. చీకటిలను శాసించే రాక్షసులది కాదు.  ఆ రాక్షసులను ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్దం చేసిన ఓ రాజుది. గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్ని వణికించిన మహారాజుది అంటూ డాకు మహారాజ్ పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

4 /7

తాజాగా ‘డాకు మహారాజ్’ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సందర్బంగా సెన్సార్ సభ్యులు చెప్పిన ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఈ సినిమా మాస్ ప్రేక్షకులకు విందు భోజనం లాంటిదని చెప్పుకొచ్చారు.సినిమాలో బాలయ్య ఇంట్రడక్షన్ సీన్.. ఇంటర్వెల్ బ్యాంగ్.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్.. క్లైమాక్స్ అన్ని సంక్రాంతికి అభిమానులకు విందు భోజనం అని చెబుతున్నారు. 

5 /7

ఇంటర్వెల్ తర్వాత ‘డాకు మహారాజ్’ ఎపిసోడ్ హైలెట్ అని చెప్పారు. అప్పట్లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు తర్వాత బాలయ్య కెరీర్ లో ‘డాకు మహారాజ్’ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కొన్నేళ్లు పాటు గుర్తుండి పోవడం గ్యారంటీ అంటున్నారు. ఇందులో బాలయ్య కామెడీ కూడా పండిందని చెబుతున్నారు.

6 /7

మరోవైపు బాబీ దేవోల్ తో బాలయ్య యాక్షన్ సీన్స్ తో రాజస్థాన్, మధ్య ప్రదేశ్ చంబల్ ప్రాంతాల్లో ఈ సినిమాను పిక్చరైజ్ చేసారు. దీంతో పాటు పాపతో సెంటిమెంట్ సన్నివేశాలు.. హీరోయిన్ తో ఐటెం సాంగ్ వంటివి హైలెట్ గా నిలివనున్నాయి.

7 /7

బాలయ్య..  తెలుగులో  సీనియర్ టాప్ స్టార్స్ తో  ఈ రేంజ్ లో హాట్రిక్ హిట్స్  అందుకొని జోరు మీదున్నాడు. అది కూడా 60 ప్లస్ ఏజ్ లో టాప్ గేర్ లో దూసుకుపోతున్నారు.  వరుసగా మూడు రూ. 100 కోట్ల గ్రాస్ అందుకున్న సీనియర్  హీరోగా రికార్డు క్రియేట్ చేసారు. మరి‘డాకూ మహారాజ్’ చిత్రంతో బాలయ్య  డబుల్ హాట్రిక్  కంటిన్యూ చేయడం పక్కా చెబుతున్నారు సెన్సార్ వాళ్లు.