Devotee Cuts His Tongue: నవరాత్రుల సమయంలో దుర్గమాత 9 అవతారాలను పూజిస్తాం. అమ్మవారికి ఇష్టమైన నేవేద్యం సమర్పించి, ధూపదీపాలు పెడతారు. అయితే, మధ్యప్రదేశ్‌లోని రత్నఘర్ ఆలయంలో ఓ భక్తుడు అమ్మవారికి ఏకంగా తన నాలుకను కట్ చేసి సమర్పించాడు.
Devotee Cuts His Tongue: నవరాత్రుల్లో అమ్మవారిని భక్తశ్రద్ధలతో పూజిస్తాం. దుర్గామాత తొమ్మిది రూపాలను 9 రోజులపాటు పూజలు చేస్తారు. ప్రతి ఏడాది ఆశ్వీయుజ మాసంలో ఈ పూజలు చేస్తారు. ఈ ఏడాది అక్టోబర్ 3న నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
మన దేశ వ్యాప్తంగా ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అయితే, మధ్యప్రదేశ్‌లోని ఓ భక్తుడు అమ్మవారికి సమర్పించిన నైవేద్యం చూసి స్థానికులు షాకింగ్‌కు గురవుతున్నారు. అవును,రామ్ శరణ్ అనే భక్తుడు తన నాలుకను కట్ చేసి అమ్మవారికి సమర్పించాడని ఆలయ పూజారి జై కిషన్ చెప్పారు.
ఈ భక్తుడు అమ్మవారికి దాదాపు మూడు అంగుళాలు తన నాలుకను కట్ చేసి సమర్పించాడని చెబుతున్నారు. అమ్మవారి వద్ద ఉన్న ఓ కుండలో రక్తాన్ని కూడా కొంతమేర నింపాడు. ఈ ఘటన గురించి తెలిసిన చుట్టుపక్కవారు అక్కడికి చేరుకుంటున్నారు. రత్నగిరి అమ్మవారు అంటే మాకు ఎంతో నమ్మకం ఉందని అందుకే సదరు భక్తుడు తన నాలుకను సమర్పించాడని చెబుతున్నారు.
కాగా, ఈ రత్నఘర్ ఆలయం 2015లో నిర్మాణం చేపట్టారు. ఈ ఆలయంలోని వెలసిన దుర్గామాతపై తమకు ఎంతగానో నమ్మకం ఉందని భక్తులు చెబుతున్నారు. అమ్మ ఎంతో దయగలదని అంటున్నారు.లాహర్ నగర్‌లో ఉన్న ఈ ఆలయంలో చాలా మంది అమ్మవారిని దర్శించుకుంటారు. అంతేకాదు ఆ భక్తుడికి మళ్లీ తిరిగి నాలుక వస్తందనే నమ్మకం మాకు ఉందని ఆలయానికి వచ్చిన భక్తులు చెబుతున్నారు.
ఆలయంలో నిన్న హవనం కూడా నిర్వహించిన భక్తుడు అమ్మవారికి భక్తితో తన నాలుకను కోసి సమర్పించాడు. ఇలాంటి ఘటనలు గతంతో కూడా కోకొల్లలు. అమ్మవారిపై ఉన్న భక్తిని చాటుకోవడానికి మరికొందరు, కోరికలు నెరవేరినప్పుడు ఇలా చేస్తారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)