Krish: దర్శకుడు క్రిష్ భార్యది కూడా నంద వివాహమే.. ప్రీతి చల్లా మొదటి భర్త ఎవరో తెలుసా..? బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Krish Jargarlamudi marriage:  గమ్యం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దర్శకుడు.. క్రిష్ జాగర్లమూడి. ఆ తరువాత ఎన్నో మెసేజ్ ఓరియెంటడ్ చిత్రాలు చేసి మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. కాగా వివాహ జీవితంలో మాత్రం ఈ దర్శకుడికి కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యాయి. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న క్రిష్ ఇప్పుడు రెండవ వివాహం చేసుకున్నారు.
 

1 /5

శర్వానంద్ హీరోగా వచ్చిన గమ్యం చిత్రంతో.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దర్శకుడు క్రిష్. ఆ తరువాత కూడా ఎన్నో మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రాలు చేసి.. తనకంటూ ఎంతో మంది అభిమానులను తెచ్చి పెట్టుకున్నారు. ముఖ్యంగా వేదం, కంచె, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలు ఈ దర్శకుడికి‌.. గొప్ప డైరెక్టర్ గా చెరిగిపోని ముద్ర తెచ్చిపెట్టాయి.

2 /5

సినిమాలలో ఎన్నో విజయాలు చవిచూసిన ఈ దర్శకుడికి ‌.. రియల్ లైఫ్ లో మాత్రం కొన్ని ఒడిదుడుకులు తప్పలేదు. హీరోయిన్ అనుష్కతో క్రిష్ ప్రేమలో ఉన్నారు అని వేయడం చిత్రం టైంలో.. రూమర్స్ వచ్చాయి. అయితే ఈ విషయంపై వారిద్దరూ కూడా స్పందించలేదు. 2016 ఆగస్టు 7వ తేదీన రమ్య అనే డాక్టర్‌ను వివాహం చేసుకొన్నారు క్రిష్. కానీ వీరిద్దరి మధ్య విభేదాల కారణంగా కేవలం రెండు సంవత్సరాల్లోనే విడాకులు తీసుకున్నారు.

3 /5

మొదటి భార్యతో వివాహం తర్వాత చాలా రోజులు మీడియాకి కూడా దూరంగా ఉన్న క్రిష్.. ఈ మధ్యనే అనుష్కతో ఘాటి  అనే చిత్రం ప్రారంభించారు. ఇక ఇదే క్రమంలో ఇప్పుడు రెండో వివాహం సైతం చేసుకున్నారు ఈ దర్శకుడు. గైనకాలజిస్ట్,డాక్టర్ ప్రీతి చల్లాతో ఈరోజు క్రిష్ వివాహం జరగగా.. ఇందుకు సంబంించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

4 /5

కాగా డాక్టర్ ప్రతీ చల్లా విషయానికి వస్తే..ఈమె తమిళనాడులో.. చెన్నైలోని రామచంద్ర యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశి.. ఆ తరువాత అమెరికాలో ఎంఎస్ పూర్తి చేశారు. 2007 నుంచి ఆమె వైద్య వృత్తిలో ఉన్నారట. అంతేకాదు వీరికే సొంత హాస్పిటల్స్ ఉండడం గమనర్హం. తన కుటుంబానికి చెందిన చల్లా హాస్పిటల్‌లో నాలుగో తరం వైద్యురాలిగా సేవలు అందిస్తున్నారు ప్రీతి. ఇక ప్రీతి తల్లి కూడా ప్రముఖ వైద్యురాలే అనేది మరో విశేషం.

5 /5

ఇక ప్రీతీ చల్లాకు కూడా.. ఇది రెండో వివాహం కావడం గమనార్హం. గతంలో డాక్టర్ భరత్‌ను పెళ్లి చేసుకున్న ఏమా.. సుమారు నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత.. అనుకోని కారణాలవల్ల విడాకులు తీసుకొన్నారు. అనంతరం క్రిష్‌తో జరిగిన పరిచయం వల్ల.. ఇద్దరి అభిప్రాయాలు కలవడం వల్ల.. వీరిద్దరూ ప్రేమలో పడి ఇప్పుడు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.