Shani dev: దీపావళి వేళ శనిదేవుడ్ని ఇలా పూజిస్తే.. ఉద్యోగంలో ప్రమోషన్లు, అంతులేని ధనం మీ సొంతం..

Shanidev puja 2024: చాలా మంది శనిదేవుడ్ని చూసి భయపడిపోతుంటారు . కానీ నిజానికి శనిదేవుడి అనుగ్రహిస్తే.. అలాంటివారి దేనీలో కూడా కొదువ ఉండదని పండితులు చెప్తుంటారు.

1 /6

సూర్యుడు, ఛాయాదేవీల కుమారుడు శని దేవుడు, ఆయనకు అన్న యమధర్మరాజు. శనిదేవుడు ముఖ్యంగా మనం చేసిన కర్మలను బట్టి పనిష్మెంట్ ఇస్తుంటాడు. అన్ని గ్రహాలలో కూడా శని గ్రహాం ఎంతో పవర్ ఫుల్ గా చెప్తుంటారు.

2 /6

శనిదేవుడు, సాడేసాతి, అర్ధాష్టమ , శని ప్రభావం అని ఎక్కువగా మనం వింటు ఉంటాం. ఈ కాలంలో ఆయన సదరు వ్యక్తి చేసుకున్న కర్మలను బట్టి తగిన ఫలితాలను ఇస్తుంటాడు. అందుకే మంచి పనులు చేయాలని పండితులు చెబుతుంటారు.

3 /6

శనిదేవుడు అనుగ్రహిస్తే పేదవాడు కూడా రాజు అయిపోతాడు. ఆయన ఆగ్రహిస్తే రాజు కూడా బికారీలా అయిపోతాడు. అందుకే మంచి పనులుచేస్తు,  దేవుడి అనుగ్రహం కోసం కష్టపడాలని కూడా పండితులు చెబుతుంటారు.

4 /6

దీపావళి అమావాస్య నాడు జరుపుకుంటాం.అయితే.. అమావాస్య తిథి శనికి ఇష్టమైనదని చెప్తుంటారు. అందుకే దీపావళి వేళ శని భగవానుడ్ని ఈ కింది విధంగా పూజించాలని చెప్తుంటారు. శనిదేవుడి అనుగ్రహాం కోసం.. కుక్కలు, కాకులు, ఆవులకు ఏదైన తినేందుకు పెట్టాలి.

5 /6

అదే విధంగా శనికి నిత్యం తైలాభిషేకం చేయాలి. హనుమంతుడు, వెంకటేశ్వర స్వామిని పూజించిన కూడా శనిదేవుడు మనల్ని అనుగ్రహిస్తాడని చెబుతుంటారు. ప్రతి శనివారం దగ్గరున్న ఆలయంకు వెళ్లాలి. అక్కడ అశ్వత్థ చెట్టు కింద దీపారాధన చేయాలి.

6 /6

నల్ల చీమలకు చక్కెర లేదా బెల్లం తినేందుకు వేయాలి.పేదవాళ్లకు ఏదైన తినేందుకు ఇవ్వాలి.  శని పీడతో ఇబ్బందులు పడుతున్న వారు పాత్రలో నూనె పోసి అందులో వాళ్ల ముఖం చూసుకొవాలి. ఆ తర్వాత దాన్ని పారుతున్న నీళ్లలో వేయాలి. వెనక్కు తిరిగి చూడకుండా ఇంటికి వెళ్లిపోవాలి. ఇలా చేస్తే.. జాబ్ లలో ప్రమోషన్ లు, అపార ధనం మీ సొంతమౌతుంది.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)