Diwali Lucky Zodiacs: దీపావళి రోజున శశ, లక్ష్మీ నారాయణ యోగాలు.. ఈ రాశులవారికి ఆఖండ ధనయోగంతో సమస్యలన్నీ మాయం!


Diwali Lucky Zodiacs: దీపావళి రోజున శశ, లక్ష్మీ నారాయణ యోగాలు ఏర్పడబోతున్నాయి. దీని కారణంగా అక్టోబర్‌ 31 నుంచి కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి..

 

Diwali Lucky Zodiacs In Telugu: ఈ సంవత్సరం దీపావళి పండగ రెండు రోజుల పాటు వస్తోంది. అక్టోబర్‌ 31వ తేది, నవంబర్‌ 1వ తేది రెండు రోజుల పాటు దీపావళి పండగను జరుపుకోబోతున్నారు. అయితే ఈ సంవత్సరం వచ్చిన పండగకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే దీపావళి రోజులు చాలా శక్తివంతమైన శశ రాజయోగంతో పాటు ఇతర యోగాలు ఏర్పడబోతున్నాయి. అలాగే శుక్రుడు, బుధ గ్రహాలకు సంబంధించిన లక్ష్మీనారాయణ యోగాలు కూడా రాబోతున్నాయి.
 

1 /6

ముఖ్యంగా అక్టోబర్‌ 31వ తేదిన ఏర్పడే కొన్ని యోగాల కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం పెరుగుతుంది. అంతేకాకుండా జీవితంలో వస్తున్న ఎలాంటి సమస్యలైనా సులభంగా పూర్తవుతాయి. 

2 /6

అలాగే ఈ దీపావళి సమయంలో లక్ష్మీ దేవితో పాటు నారాయుణుడు శని దేవుడిని వారి ఇంటికి పిలుస్తారు. దీని కారణంగా ఎంతో ప్రత్యేకమైన శుభ ప్రభావం అన్ని రాశులవారిపై పడుతుంది. ఈ ప్రభావంతో కొన్ని రాశులవారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి.  

3 /6

మేష రాశివారికి ఈ శక్తివంతమైన శశ, లక్ష్మీ నారాయణ యోగాల కారణంగా ఊహించని ఆదాయ మార్గాలు కూడా లభిస్తాయి. ఉద్యోగులకు ఈ సమయం చాలా సానుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి ఆఫీసుల్లో గౌరవం కూడా రెట్టింపు అవుతుంది. మేష రాశివారికి ఆర్థికంగా కూడా దీపావళి కలిసి వస్తుంది.  

4 /6

అలాగే మేష రాశివారికి వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. విద్యార్థాలకు ఈ సమయంలో పోటీ పరీక్షలు చాలా అనుకూలంగా ఉంటాయి. దీని కారణంగా సులభంగా విజయాలు సాధిస్తారు.  

5 /6

తులా రాశివారికి ఈ రెండు యోగాలు ఏర్పడడం వల్ల ఆర్థిత సంక్షోభం నుంచి విముక్తి లభించబోతోంది. వ్యాపారాలు కూడా అనుకూలంగా మరీ చాలా లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగాలు చేసేవారు తమ తోటి ఉద్యోగుల సహాయం పొంది.. అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు.  

6 /6

ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులు కూడా లభిస్తాయి. అలాగే మార్కెటింగ్‌ చేసేవారికి చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో వీరికి ఆనందం పేరుగుతుంది.