Pawan Kalyan family tree: సినిమా హీరో గానే కాదు ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా కూడా రానిస్తున్నారు.. పవన్ కళ్యాణ్. ఇక సినిమాలు, రాజకీయాలు పరంగానే కాకుండా తన పర్సనల్ విషయాల ద్వారా.. కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తూఉంటారు ఈ హీరో. తాజాగా పవన్ కళ్యాణ్ వంశ వృక్షం కి సంబంధించిన ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతోంది.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు పవన్ కళ్యాణ్. ఒకవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూనే మరొకవైపు సమాజసేవ చేస్తూ మంచి నాయకుడు అనిపించుకున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో 2024 సార్వత్రిక ఎన్నికలలో పిఠాపురం నుంచి పోటీ చేసి గెలుపొందడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు.
ఇకపోతే అటు సినిమాల ద్వారా ఇటు రాజకీయాల ద్వారా బాగా సక్సెస్ అయిన ఈయన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎప్పుడు విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటారు అనడంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా ఆయన మూడు వివాహాలు చేసుకున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే ఈయన భార్యలు, వారి పిల్లలకు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ట్రీ అంటూ ఆ ఫోటో తెగ హల్చల్ చేస్తోంది.
ఇకపోతే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో పెద్దల కోరిక మేరకు.. 1997లో నందిని రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2008లో ఆమె నుంచి విడిపోయారు పవన్ కళ్యాణ్. వీరిద్దరికీ ఎటువంటి సంతానం లేరు.
నిజానికి రేణు దేశాయ్ తో.. సహజీవనం చేస్తున్నాడు అన్న కారణంతోనే నందిని రెడ్డి.. విడాకులు ఇచ్చిందనే వార్తలు అప్పట్లో వినిపించాయి. ఆ తర్వాత రేణూ దేశాయ్ ను 2009లో వివాహం చేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ పెళ్ళికి ముందే..ఆమెతో సహజీవనం చేసి ఆమెను గర్భవతిని చేశారు పవన్ కళ్యాణ్.
రేణు దేశాయ్ 2004 ఏప్రిల్ 8న అకీరా నందన్ కి జన్మనివ్వగా ఆ తర్వాత కొడుకు సమక్షంలో 2009లో వివాహం చేసుకున్నారు. ఇక 2010లో మార్చి 10న ఆధ్యా అనే అమ్మాయి జన్మించింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఎత్తడంతో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ 2012లో విడాకులు తీసుకున్నారు.
ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రష్యాకు చెందిన మోడల్ అన్నా లెజినోవా ను వివాహం చేసుకున్నారు. అయితే ఆమెకి కూడా..అప్పటికే వివాహం జరిగి విడాకులైనట్లు సమాచారం.
ఇక పవన్ కళ్యాణ్ ను వివాహం చేసుకున్న తర్వాత 2014 అక్టోబర్ 15న.. పోలేనా అంజన పవనోవా అనే అమ్మాయికి జన్మనిచ్చారు. ఆ తర్వాత 2017 అక్టోబర్ 10 వ తేదీన మార్క్ శంకర్ పవనోవిక్ అనే అబ్బాయికి జన్మనిచ్చారు ఈ జంట.