ఆల్కహాల్ సేవించడం ఆరోగ్యానికి హానికరమైనా సరే..స్టేటస్ సింబల్‌గా మాత్రం మారిపోయింది. వేడుక ఏదైనా సరే..మద్యం పార్టీ లేకుండా ఉండటం లేదు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన టాప్ 5 మద్యం బ్రాండ్ల గురించి తెలుసుకుందాం.
కొంతమంది మద్యం బ్రాండ్‌ను బట్టి స్థాయిని అంచనా వేస్తున్నారు. కొన్ని పార్టీల్లో కన్పించే బ్రాండ్లు ఎంత ఖరీదైనవిగా ఉంటాయంటే..వాటి ధర అంచనా వేయడమే కష్టం. అటువంటి బ్రాండ్ల గురించి తెలుసుకుందాం..
ప్రపంచపు అత్యంత ఖరీదైన రెడ్ వైన్ పెన్‌ఫోల్డ్స్ యాంప్యూల్. ఈ రెడ్ వైన్ బాటిల్ పెన్ ఆకారంలో ఉంటుంది. ఒక బాటిల్ ధర కోటి 20 లక్షల రూపాయలు.
ప్రపంచపు అత్యంత ఖరీదైన విస్కీ బ్రాండ్లలో డేల్‌మోర్ 62 ముఖ్యమైంది. ఈ బాటిల్ ధర ఎంత ఎక్కువంటే ఇప్పటి వరకూ కేవలం 12 బాటిళ్లే తయారయ్యాయి. ఈ విస్కీ ఒక బాటిల్ ధర కోటి 50 లక్షల రూపాయలు
ఈ మద్యం బ్రాండ్ పేరు బ్రిగనేక్ మిడాస్. ఇదే ప్రపంచంలోని అత్యంత ఖరీదైన షాంపెయిన్‌గా ఉంది. ఈ బాటిల్ సైజ్ కూడా చాలా పెద్దది. దీని ధర వింటే ఆశ్చర్యపోతారు. కోటి 40 లక్షల కంటే ఎక్కువే ఇది.
డీవా వోడ్కా...ప్రపంచంలో అతి ఖరీదైన వోడ్కా ఇదే. ప్రతి బాటిల్ మధ్యలో ఓ ప్రత్యేకమైన అర ఉంటుంది. ఇందులో స్వరోవ్ స్కీ క్రిస్టల్స్ ఉంటాయి. దీన్ని డ్రింక్‌ను గార్నిష్ చేసేందుకు ఉపయోగిస్తారు. ఈ వోడ్కా ధర 7 కోట్ల 30 లక్షలు మాత్రమే..
టకీలా 925 అనేది ప్రపంచంలో అతి ఖరీదైన మద్యం బ్రాండ్. ఈ మందు బాటిల్‌లో 64 వందల వజ్రాలు చేర్చి ఉంటాయి. అవును నిజమే. ఈ మద్యంను మెక్సికోలో లాంచ్ చేశారు. కానీ 64 వందల వజ్రాలున్న మద్యం బాటిల్ ఇవాళ్టి వరకూ ఎవరూ కొనుగోలు చేయలేదు. అందుకే దీని ధర ఇంకా తెలియదు.