Pfizer vaccine: ఫైజర్ వ్యాక్సిన్ పనిచేయడం లేదా..వ్యాక్సిన్ తీసుకున్న నర్శ్‌కు కరోనా పాజిటివ్

ఫైజర్ వ్యాక్సిన్ మరో సైడ్ ఎఫెక్ట్ అమెరికాలో వెలుగు చూసింది. అయితే ఈసారి సైడ్ ఎఫెక్ట్ సంగతేమో గానీ..వ్యాక్సిన్ సామర్ధ్యంపై సందేహాల్ని లేవనెత్తుతోంది. వ్యాక్సిన్ తీసుకున్న ఓ నర్శ్‌కు కరోనా వైరస్ సోకింది.
  • Dec 30, 2020, 18:02 PM IST

Pfizer vaccine: ఫైజర్ వ్యాక్సిన్ మరో సైడ్ ఎఫెక్ట్ అమెరికాలో వెలుగు చూసింది. అయితే ఈసారి సైడ్ ఎఫెక్ట్ సంగతేమో గానీ..వ్యాక్సిన్ సామర్ధ్యంపై సందేహాల్ని లేవనెత్తుతోంది. వ్యాక్సిన్ తీసుకున్న ఓ నర్శ్‌కు కరోనా వైరస్ సోకింది.

1 /4

కరోనా వ్యాక్సిన్ తీసుకోకముందే నర్శ్‌కు కరోనా సోకి ఉండవచ్చని కూడా కొందరంటున్నారు. 

2 /4

అయితే నిపుణులు చెప్పేది వేరేలా ఉంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కొద్దిరోజుల తరువాత పాజిటివ్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. వ్యాక్సిన్ ట్రయల్ సందర్బంగా ఈ విషయం తెలిసిందన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న 10-14 రోజుల తరువాత సదరు వ్యక్తిలో ఇమ్యూనిటీ వృద్ధి అవుతుంది. పూర్తి రక్షణ కోసం రెండవ డోసు కూడా తీసుకోవాలి.

3 /4

డిసెంబర్ 18వ తేదీన 45 ఏళ్ల నర్శు మేధ్యూకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. కానీ 6 రోజుల తరువాత ఆమెలో కరోనా వైరస్ లక్షణాలు కన్పించాయి.  మేథ్యూ పని చేసేది కరోనా వైరస్ వార్డులోనే.

4 /4

శ్యాన్ డియోగోలో ఉండే నర్శ్ మేథ్యూ డబ్ల్యూ ఫైజర్ కంపెనీ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం సైడ్ ఎఫెక్ట్ కన్పించింది. చేయి నొప్పి ప్రారంభమైంది.