Dream about Snakes: పాములు కొంత మందికి కలలో అదేపనిగా కన్పిస్తుంటాయి. దీని వల్ల జీవితంలో ఎలాంటి సమస్యలు వస్తాయో అని తెగ టెన్షన్ పడిపోతుంటారు. ఇలాంటి వారు కొన్ని విషయాలు తెలుసుకొవాలి.
సాధారణంగా మనం పడుకున్న తర్వాత ఏవైన కలలు వస్తుంటాయి. ముఖ్యంగా మనం ఏది ఎక్కువగా తలుచుకుంటామో..దేన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తామో.. అలాంటివి కలలో కన్పిస్తుంటాయి.
కానీ కొందరికి మాత్రం కలలో చనిపోయిన వాళ్లు, పెళ్లి చేసుకున్నట్లు, పంక్తి భోజనాలు, జలపాతాలు, పాములు కలలో కన్పిస్తుంటాయి. దీని వల్ల భయపడి చాలా మంది వెంటనే మేల్కొంటారు. అయితే.. పాములు కన్పించడం వల్ల కొన్నిసార్లు అలర్ట్ గా ఉండాలని ఇది జాతకంలో మిశ్రమ ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతున్నారు.
కలలో పాములు కన్పిస్తే.. రాబోయే సమస్యలను సూచిస్తున్నాయని చెప్పవచ్చు. కలలో నల్ల పాములు కన్పిస్తే.. పెద్ద ఆపదలో చిక్కుకుంటారని దాని అర్థం. అదే విధంగా కలలో కనుక శ్వేత నాగు కన్పిస్తే.. రాబోయే మంచి కాలానికి సంకేతం అని చెప్పవచ్చు.
పాములు మనకు కుడివైపు నుంచి ఎడమ వైపుకు పోతే.. చెడు జరుగుతుందని, అదే విధంగా ఎడమ నుంచి కుడివైపుకు వెళ్తే మాత్రం మంచి జరుగుతుందని కొంత మంది చెప్తుంటారు. పాములకు ఎట్టి పరిస్థితుల్లోనే ఆపద కల్గించకూడదంటారు.
పాములకు ఆపద కల్గిస్తే కాలసర్పదోషం వస్తుంది. దీని వల్ల లైఫ్ లో సెటిల్ మెంట్ చాలా ఆలస్యమౌతుంది. జీవితంలో సరైన విధంగా ఎదుగుదల ఉండదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న విధంగా ఉంటుంది.
పాములు కలలో అదే పనిగా వస్తే.. కాలసర్పదోషం శాంతి చేయించుకొవాలి. ఆ తర్వాత.. జంట నాగులకు పాలాభిషేకం చేయాలి. రాహు, కేతులకు శాంతి చేయించుకొవాలి. నాగుల పంచమి రోజున ఉపవాసం చేయాలి. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)