Dried Almonds Vs Soaked Almonds: ప్రతిరోజు ఉదయం పూట చాలామంది ఎండిన, బాదంపప్పు నానబెట్టిన బాదంపప్పు తింటూ ఉంటారు. నిజానికి ఈ రెండు పద్ధతుల్లో బాదంపప్పును ఎలా తీసుకుంటే శరీరానికి ఎక్కువ లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు కూడా ఈ రెండింటిలో ఏది మంచి పద్ధతో తప్పక తెలుసుకోండి.
Dried Almonds Vs Soaked Almonds: ఆధునిక జీవనశైలి కారణంగా వస్తున్న అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకొని చాలామంది ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా చాలామంది పోషకాలు కలిగిన ఆహారాలతో రోజుని ప్రారంభిస్తున్నారు. అలాగే అల్పాహారం తినడానికి ముందు ప్రతిరోజు డ్రైఫ్రూట్స్ కూడా తింటున్నారు.
ప్రస్తుతం చాలామంది తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో బాదాం ఒకటి. ఈ బాదం పలుకుల ధర కొంచెం ఎక్కువ అయినప్పటికీ.. ఇందులో అనేక రకాల పోషకు గుణాలుంటాయి. అందుకే చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వీటిని తీసుకుంటూ ఉంటారు.
అలాగే చాలామంది బరువు తగ్గాలనుకునే వారు డైట్లో భాగంగా ఈ బాదం పలుకులను కూడా వినియోగిస్తూ ఉంటారు. ఈ బాదం పలుకుల్లో ఉండే కొన్ని పోషక గుణాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు కూడా ఎంతగానో సహాయపడతాయి.
కొంతమంది ఉదయం పూట బాదాం పలుకులను నానబెట్టి తింటూ ఉంటారు. మరి కొంతమంది అయితే ఎండిన బాదంనే తీసుకుంటూ ఉంటారు. అయితే వీటిని నానబెట్టి తినడం వల్ల ఎక్కువ లాభాలు కలుగుతాయా.. వట్టివి ఎక్కువగా లాభాలు కలిగిస్తాయా? వీటిని ఎలా తీసుకోవడం మేలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ప్రతిరోజు ఉదయం పూట ఎండిన వాటికంటే నానబెట్టిన బాదం శరీరానికి ఎక్కువ లాభాలను అందిస్తాయట. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
ముఖ్యంగా నానబెట్టిన బాదం పలుకులను పొట్టు తీసి తినడం వల్ల జీర్ణ క్రియ ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా పొట్ట సమస్యలు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నానబెట్టిన బాదం పలుకుల్లో ఫోలిక్ యాసిడ్ అధిక మోతాదులో లభిస్తుంది. కాబట్టి వీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయి. దీంతోపాటు శరీరాన్ని యాక్టివ్గా ఉంచేందుకు కూడా సహాయపడతాయి.
నానబెట్టిన బాదంను ప్రతిరోజు ఉదయం తినడం వల్ల శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా చెడు కొవ్వు కూడా సులభంగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా డైట్లో నానబెట్టిన బాదం పప్పును తినండి.