Dulquer salmaan: దుల్కర్ సల్మాన్ స్కూల్ లవ్ స్టోరీ.. అప్పట్లోనే అలా..!

Dulquer salmaan Love Story: దుల్కర్ సల్మాన్.. తాజాగా లక్కీ భాస్కర్ సినిమాను విడుదల చేశారు.  ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆహా ఓటీటీ లో అన్ స్టాపబుల్ షో వేదికగా.. తన లవ్ స్టోరీ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ చెప్పిన తన లవ్ స్టోరీ తెగ వైరల్ అవుతుంది.

1 /6

ప్రముఖ మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ ..తాజాగా లక్కీ భాస్కర్ అనే సినిమాతో అక్టోబర్ 31వ తేదీన దీపావళి సందర్భంగా,  ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే మొదటి రోజే రూ.10 కోట్ల మేరా కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా , దీపావళి హాలిడేస్ ను క్యాష్ చేసుకోబోతోందని చెప్పవచ్చు.

2 /6

ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. బాలకృష్ణ హోస్ట్ గా  వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ ఫోర్ కి ముఖ్యఅతిథిగా వచ్చారు. మొదటి ఎపిసోడ్ లో భాగంగా నారా చంద్రబాబునాయుడు రాగా రెండవ ఎపిసోడ్ నిన్న రిలీజ్ చేయగా.. ఈ ఎపిసోడ్లో లక్కీ భాస్కర్ టీం దుల్కర్ సల్మాన్, నాగవంశీ, మీనాక్షి చౌదరి, వెంకీ అట్లూరి గెస్ట్ లుగా వచ్చారు. 

3 /6

ఈ క్రమంలోనే దుల్కర్ సల్మాన్ తన స్కూల్ లవ్ స్టోరీ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇకపోతే దుల్కర్ అమల్ సూఫియా అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. 

4 /6

ఇక ఇదే విషయాన్ని ఆయన మాట్లాడుతూ.. “నా స్కూల్ జూనియర్ అమల్. నేను 12వ తరగతి చదువుతున్నప్పుడు ఆమె ఎనిమిదవ తరగతి.. అప్పుడంతగా మాట్లాడుకునేవాళ్ళం కాదు. ఆ తర్వాత అప్పుడప్పుడు చెన్నైలో థియేటర్స్, రెస్టారెంట్లో మాత్రం కనిపించేది .మామూలుగా తెలిసినా ఎక్కువగా మాట్లాడుకునే వాళ్లమ కూడా కాదు. జస్ట్ మా ఇద్దరి మధ్య పరిచయం ఉండేది.” 

5 /6

“నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నప్పుడు నేనే తన ఫేస్బుక్లో మెసేజ్ చేశాను. మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు.. మరి మీ ఇంట్లో కూడా చూస్తున్నారా అయితే ఒకసారి కలిసి మనం ఎందుకు మాట్లాడుకోకూడదు అని అడిగాను. ఆ తర్వాత మేమిద్దరం కలిసి మాట్లాడుకున్నాం. అలా మూడు వారాల్లోనే మా నిశ్చితార్థం అయిపోయింది.  ఇప్పటికి మా పెళ్ళై 13 యేళ్లు అవుతోంది,” అంటూ తెలిపారు.   

6 /6

మొత్తానికి అయితే చిన్నగా సింపుల్ గా చెప్పేసి అందరిని ఆశ్చర్యపరిచారు దుల్కర్ సల్మాన్. ఇక స్కూల్ అమ్మాయితో ఈయన ప్రేమాయణం విని అందరూ ఎంత క్యూట్ కదా అంటూ కామెంట్ చేస్తున్నారు.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x