EPFO: మెడికల్‌ ఎమర్జెన్సీకి పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా? ఇలా చేస్తే లక్ష మీ సొంతం..

EPFO For Medical Emergency: మన జీవితంలో కొన్నిసార్లు మంచి మాత్రమే కాదు కొన్నిసార్లు కొన్ని క్లిష్టపరిస్థితులు కూడా ఎదురవుతాయి. అందుకే మన దేశంలో వివిధ రకాల పెట్టుబడులు అందుబాటులో ఉన్నాయి. సేవింగ్స్‌, ఫిక్సెడ్‌, రికరింగ్‌, స్మాల్‌ సేవింగ్‌ ఇతర పథకాలు అందుబాటులో ఉన్నాయి.
 

1 /5

ఇందులో కొన్ని అత్యవసర పరిస్థితుల్లో వెంటనే విత్‌డ్రా చేయొచ్చు. అయితే, మీకు కూడా మెడికల్‌ ఎమర్జెన్సీ ఉంటే ఈపీఎఫ్ఓ నుంచి డబ్బు ఎలా విత్‌డ్రా చేయాలా? అనుకుంటున్నారా? ఎంప్లాయీస్‌ ప్రొవిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) తమ సభ్యులకు మెడికల్‌ ఎమర్జెన్సీలో డబ్బును అందుబాటులో ఉంచుతోంది. ఇందులో ఇంటి నిర్మాణం, పెళ్లి, చదువు, హోంలోన్‌ ఇతర అవసరాలకు డబ్బును పొందే సౌలభ్యం కల్పిస్తుంది.  

2 /5

ఈపీఎఫ్ఓ ఇది పదవీవిరమణ సేవింగ్స్‌ స్కీమ్‌. తద్వారా ప్రతినెలా జీతంలో కొంతమేర పీఎఫ్‌ ఖాతాలో జమా అవుతుంది.. ఈ డబ్బు రిటైర్మెంట్‌ సమయంలో చేతికి అందుతుంది. ఇది కేవలం శాలరీ పొందే ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో ఏ రిస్క్‌ ఉండదు.  

3 /5

ఈపీఎఫ్ఓ సభ్యత్వం ఉన్నవారు లక్ష వరకు మెడికల్‌ ఎమర్జెన్సీకి విత్‌డ్రా చేసుకోవచ్చు. మెడికల్‌ ఎమర్జెన్సీ విత్‌డ్రా లిమిట్‌ ప్రస్తుతం లక్ష ఉంది. ఈ డబ్బును ఎలా విత్‌డ్రా చేసుకోవచ్చో తెలుసుకుందాం.  

4 /5

పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా ఇలా చేయండి.. ముందుగా ఈపీఎఫ్ఓ మెంబర్‌ అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయాలి. అక్కడ లాగిన్‌ చేసి యూఏఎన్‌ (UAN) నంబర్‌, పాస్వర్డ్‌, క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత బ్యాంక్‌ డిటెయిల్స్‌ నమోదు చేసి వెరిఫై బట్టన్ పై క్లిక్‌ చేయాలి. దీనికి క్లెయిమ్‌ ఫారమ్‌ 31 డిసీజ్‌ సెలక్ట్‌ చేసి ప్రొసీడ్‌ ఆన్‌లైన్ క్లెయిమ్‌ పై క్లిక్‌ చేయండి.

5 /5

ఒకవేళ ముందుగానే రోగి ఆస్పత్రి నుంచి డిస్‌ఛార్జ్‌ అయితే మెడికల్‌ బిల్స్‌ ఈపీఎఫ్ఓలో 45 రోజుల్లోగా సబ్మిట్‌ చేయాలి. ఆ తర్వాత డబ్బులు మీ ఖాతాలో జమా అవుతాయి.