South Heroins Educational Qualifications: రష్మిక టూ సాయి పల్లవి, శ్రీలీల సహా మన హీరోయిన్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్.. ఎవరేం చదివారంటే..


South Heroins Educational Qualifications: సినిమాలకు చదువకు పెద్దగా సంబంధం లేదు. మన దగ్గర ఎంతో మంది గ్లామర్ తో పాటు కాస్త నటనతో పాటు లక్ తో హీరోయిన్స్ గా సత్తా చాటిన వాళ్లున్నారు. ఇక తెలుగు సహా దక్షిణాదిన  రాణిస్తున్న టాప్  హీరోయిన్స్ ఏం చదువుకున్నారో తెలిస్తే మైండ్ బ్లాంక్ అంతే..

1 /12

శ్రీలీల-- టాలీవుడ్ అగ్ర హీరోయిన్ గా దూసుకుపోతున్న శ్రీలీల డాక్టర్ చివరి యేడాది చదువుతోంది. ఈ ఇయర్ డాక్టర్ గా పట్టా పుచ్చుకోబోతుంది.

2 /12

సాయి పల్లవి.. తెలుగులో ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన సాయి పల్లవి.. TBILES స్టేట్ మెడికల్ విశ్వవిద్యాలయం నుంచి MBBS పూర్తి చేసింది. డాక్టర్ పట్టా పుచ్చుకున్నా.. యాక్టింగ్ పై మక్కువతో నటిగా మారింది.

3 /12

రష్మిక మందన్న.. ప్రస్తుతం ప్యాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లో సత్తా చాటుతున్న అసలు సిసలు ప్యాన్ ఇండియా భామ రష్మిక మందన్న. ఈమె సైకాలజీలో డిగ్రీ చేసింది.  

4 /12

పూజా హెగ్డే.. పూజా హెగ్డే కర్ణాటకలో  MMK కాలేజీలో M.Com చేసింది. ప్రస్తుతం కెరీర్ పరంగా హీన స్థితిలో ఉంది. రాబోయే ‘దేవా’ సినిమాపై అమ్మడు ఆశలు పెట్టుకుంది.

5 /12

కీర్తి సురేశ్.. కీర్తి సురేశ్ కేంద్రీయ విద్యాలయలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసుకుంది. అంతేకాదు ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్త చేసింది. 

6 /12

నయనతార.. సౌత్ లేడీ సూపర్ స్టార్ గా అభిమానులతో పిలిపించుకునే నయనతార.. చదవు మొత్తం ఉత్తరాదిలో జరిగింది. హీరోయిన్ కెరీర్ స్టార్ట్ కాకముందే మార్దోమా కాలేజ్ లో బీఏ డిగ్రీ పూర్తి చేసింది.

7 /12

సమంత.. ఈ చెన్నై పొన్ను మద్రాసులోని స్టెల్లా మేరీ కాలేజిలో కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. ప్రస్తుతం కెరీర్ పరంగా పీక్స్ లో ఉంది.

8 /12

అనుష్క శెట్టి.. స్వీటీ శెట్టి అలియాస్ అనుష్క శెట్టి బెంగళూరులోని కార్మెల్ కాలేజిలో కంప్యూటర్ అప్లికేషన్స్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది.

9 /12

త్రిష.. త్రిష తెలుగు, తమిళంలో అగ్ర కథానాయికగా రాణిస్తోంది. ఈమె చెన్నైలోని ఉమెన్స్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది.

10 /12

కాజల్ అగర్వాల్:   కాజల్ అగర్వాల్ దేశ ఆర్ధిక రాజధాని  ముంబాయిలోని కేసీ కాలేజిలో  మాస్‌ మీడియా కమ్యూనికేషన్‌లో మార్కెటింగ్‌ లో డిగ్రీ పట్టా పొందింది.

11 /12

తమన్నా.. తమన్నా ముంబైలో మానెక్ జీ కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పాఠశాలల్లో చదివారు. ఆర్ట్స్ లో డిగ్రీ పట్టా పొందారు.

12 /12

మీనాక్షి చౌదరి.. మీనాక్షి చౌదరి పంజాబ్‌లోని డేరా బస్సీ డెంటల్ కాలేజీలో డెంటల్ సర్జరీ చేసి డాక్టర్ అయింది.  రీసెంట్ గా మీనాక్షి చౌదరి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x