EPFO Pension: ప్రైవేట్ ఉద్యోగులకు కూడా త్వరలోనే రూ.10 వేలకు పైగా పెన్షన్ రాబోతోంది. ఇప్పటికే ఈ అంశంపై కేబినెట్‌లో చర్చింనట్లు సమాచారం. అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
EPFO Pension: ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగులు పదవి విరమణ పొందిన తర్వత తప్పకుండా ఏదో ఒక పెన్షన్ పొందాలని ఆశిస్తూ ఉండడం కామన్.. ఇక ప్రభుత్వ ఉద్యోగుల గురించి చెప్పక్కర్లేదు..వారికి యథావిధిగా రిటైర్మెంట్ తర్వాత తప్పకుండా పెన్షన్ వస్తుంది. ఇక ప్రైవేటు ఉద్యోగులకే ఎదైనా స్కీమ్‌లు కడితే కానీ రాదు.. అయితే వీరిని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే మోదీ ప్రభుత్వం రిటైర్మెంట్ ప్రైవేటు ఉద్యోగులకు కూడా పెన్షన్ అందిచేందుకు కీలక ప్రకటన చేయబోతోంది.
EPFO ఖాతా దారులు భారీ ప్రయోజనాలు పొందేందుకు కేంద్రం త్వరలోనే ప్రైవేటు ఉద్యోగులకు సంబంధించిన జీతాలకు పెంపునకు సంబంధించిన అంశాలపై కూడా చర్చించనుంది. దీని వల్ల పదవి విరమణ పొందిన తర్వత పెన్షన్‌కు సంబంధించిన ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి.
ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే యూనివర్సల్ పెన్షన్ సిస్టం ద్వారా పెన్షన్‌కి సంబంధించిన అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. అయితే ప్రైవేటు ఉద్యోగులను కూడా ఇదే సిస్టం కిందికి తీసుకు రావాలని కేంద్ర యోచిస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై కేబినెట్‌లో కూడా చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు ఉద్యోగుల జీతాలను కూడా పెంచేందుకు యోచిస్తే.. ఇదే సమయంలో PF కాంట్రిబ్యూషన్ శాతం కూడా భారీ మొత్తంలో పెరిగే ఛాన్స్ ఉంది. దీని వల్ల భారీ మొత్తం ఫీఎఫ్ ఖాతాలు డబ్బులు చేరుతాయి.
ఇక కేంద్రం ఇదే పని కనుక చేస్తే ప్రైవేటు ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు సరిసమానం పదవి విరమణ తర్వాత పెన్షన్ లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇక ఈ PF కాంట్రిబ్యూషన్‌కి సంబంధించిన ప్రకటన త్వరలోనే చేసే అవకాశాలు ఉన్నాయి.
కార్మిక శాఖ ఇదే అంశంపై ప్రత్యేకమైన ప్రపోజల్‌ను కూడా రెడీ చేసి డాక్యుమెంట్ రూపంలో ఆర్థిక శాఖకు అందించబోతున్నట్లు సమాచారం. అయితే దీనిని ఆర్థిక శాఖ అమోదించిన వెంటనే ప్రైవేటు ఉద్యోగుల జీతాలు పెరగడమే కాకుండా PFకి సంబంధించిన కట్టింగ్స్ కూడా విపరీతంగా పెరుగుతాయి.
ఈ ప్రపోజల్‌లో పేర్కొన్న కొన్ని వివరాలు పరిశిలిస్తే.. EPFకి సంబంధించిన వేతన పరిమితిని దాదాపు రూ.21 వేలకు పైగానే పెంచమని కార్మిక మంత్రిత్వ శాఖ ప్రపోజల్ చేసినట్లు తెలుస్తోంది. దీనిని కేంద్రం ఆమోదిస్తే ప్రతి ఉద్యోగి జీతం ఊహించని స్థాయిలో పెరుగుతుంది.
జీతాలు పెరగడం వల్ల PF భారీ మొత్తం పెరుగుతుంది. దీని కారణంగా రిటైర్మెంట్ తర్వాత ప్రైవేటు ఉద్యోగులు కూడా దాదాపు నెలకు రూ.10 వేల పైనే పెన్షన్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది జీవితకాలం పెన్షన్‌గా కూడా మారుతుంది.