Escientia Pharma: క్షతగాత్రులను చూసి భావోద్వేగానికి లోనైన చంద్రబాబు

Chandrababu Anounces Ex Gratia To Escientia Pharma Incident Victims: అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా ప్లాంట్‌లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు, గాయపడిన వారిని సీఎం చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు భారీ నష్ట పరిహారం ప్రకటించారు.

1 /8

Escientia Pharma Incident Ex Gratia: ఏపీలోని అనకా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా ప్లాంట్‌లో 17 మంది మృతి చెందగా.. 50 మంది గాయపడ్డారు. ప్రమాదం విషయం తెలుసుకుని వెంటనే అచ్యుతాపురానికి సీఎం చంద్రబాబు చేరుకున్నారు.

2 /8

Escientia Pharma Incident Ex Gratia: ప్రమాదంలో గాయపడి మెడికవర్, కేజీహెచ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను చంద్రబాబు పరామర్శించారు.

3 /8

Escientia Pharma Incident Ex Gratia: పరామర్శించిన అనంతరం బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడారు. మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

4 /8

Escientia Pharma Incident Ex Gratia: పరామర్శ అనంతరం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి, తీవ్ర గాయాలైన వారికి రూ.50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. 

5 /8

Escientia Pharma Incident Ex Gratia: ఎంత ఖర్చయినా అందరికీ వైద్య సేవలందిస్తామని చంద్రబాబు బాధితులకు భరోసా ఇచ్చారు. అవసరమైన వారికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయిస్తామని చెప్పారు.

6 /8

Escientia Pharma Incident Ex Gratia: భవిష్యత్‌లో ఫార్మా కంపెనీలు, పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు.

7 /8

Escientia Pharma Incident Ex Gratia: ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

8 /8

Escientia Pharma Incident Ex Gratia: ఫార్మా ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. కానీ ఫార్మా కంపెనీ యజమాని కిరణ్‌ ఆచూకీ లభించడం లేదు. 17 మంది మృతికి కారణమైన ఫార్మా కంపెనీపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.